బిజినెస్

ఆధార్ నమోదు లక్ష్యం సగానికి కుదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: బ్యాంకుల్లో రోజువారీ ఆధార్ నవీకరణ లక్ష్యాన్ని యుఐడీఏఐ సగానికి తగ్గించింది.ది 2018, జూలై 1నుంచి అమల్లోకి రానున్నది. వచ్చే అక్టోబర్ 1 నుంచి ఆధార్ సదుపాయం ఉన్న బ్యాంకులు రోజుకు 12 వరక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్లు, నవీకరణలు పూర్తి చేయాలి. అదేవిధంగా 2019, జనవరి 1 నుంచి రోజుకు 16 ఎన్‌రోల్‌మెంట్లు, నవీనకరణలు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ‘క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా’ ఆధార్ నమోదు లక్ష్యాన్ని సగానికి తగ్గించినట్టు యుఐడీఏఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో జులై నెల వరకు రోజుకు 8 ఆధార్ నవీకరణలను పూర్తి చేసిన బ్యాంకులకు ‘ఆర్థిక ప్రోత్సాహకాల్లో కోత’ విధించబోరని బ్యాంకు వర్గాలు తెలిపాయి.
ఖాతాదారుల బ్యాంకు అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానం చేయడం సులభమవుతుందన్న తలంపుతో బ్యాంకు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్త నిర్దేశం ప్రకారం ప్రతి బ్యాంకు మొత్తం శాఖల్లో పదిశాతం బ్రాంచ్‌ల్లో ఆధార్ కేంద్రాలను నెలకొల్పాల్సి ఉంటుంది.