బిజినెస్

వార్షిక సెలవులో కొచ్చర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ ముందస్తు ప్రణాళిక ప్రకారం వార్షిక సెలవుపై వెళ్లారని, బ్యాంకు బోర్డు వత్తిడిపై సెలవుపై వెళ్లారన్న ప్రచారంలో నిజంలేదని ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఈ విషయమై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని బ్యాంకు ప్రకటనలో పేర్కొంది. చందా కొచ్చర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరించారన్న అభియోగాలు వచ్చిన విషయం విదతమే. ఈ విషయమై ఇప్పటికే సెబి నోటీసులు కూడా జారీ చేసింది. కొచ్చర్ తర్వాత ఆ స్థానంలో నియమించే అధికారి కోసం సెర్చ్ కమిటీని నియమించారన్న సమాచారంలో వాస్తవం లేదని బ్యాంకు పేర్కొంది. కాగా బ్యాంకు ఎండిగా కొచ్చర్ నిబంధనలకు కట్టుబడకుండా తన కుటుంబ సభ్యుల ఆర్థిక ప్రయోజనాలు చేకూరే విధంగా వ్యవహరించారన్న అభియోగంపై అంతరంగికంగా స్వతంత్ర అధికారి చేత విచారణ జరిపించాలని బ్యాంకు గత వారం నిర్ణయించిన విషయం విదితమే. ఈ విషయమై ఆడిట్ కమిటీ ఒక నిర్ణ యం తీసుకోవాలని బ్యాంకు ఆదేశించింది.
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐసీఐసీఐ ఈ విషయాన్ని ప్రస్తావించింది. వీడియోకాన్‌తో డీల్ క్విడ్ ప్రోకో పద్ధతి ద్వారా ఖరారైందని ఐసీఐసీఐకు ఫిర్యాదు అందింది.