బిజినెస్

18 నెలల గరిష్ఠానికి విదేశీ నిధుల ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: మేనెల మొత్తం మీద ఫారెన్ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్ నుంచి రూ.29,714 కోట్ల నిధులను విదేశాలకు తరలించారు. గత 18 నెలల కాలంలో విదేశాలకు తరలిన అతిప్దె మొత్తం ఇదే. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. విదేశాలకు తరలిపోయిన నిధుల్లో తర్వాతి స్థానాన్ని మూలధన పెట్టుబడులు (ఈక్విటీ, రుణాలు) ఆక్రమిస్తున్నాయి. ఈవిధంగా తరలిపోయిన మొత్తం రూ.15,561 కోట్లు. దీనికి ముందు మార్చి నెలలో రూ.2,662 కోట్లమేర విదేశీ మదుపర్లు దేశీయ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు రూ.10,060 కోట్ల మేర ఈక్విటీ మొత్తాన్ని ఉపసంహరించుకోగా, రూ.19,654 కోట్ల మేర డెబిట్ మెర్కెట్‌నుంచి ఉపసంహరించడంతో వీరు ఉపసంహరించుకున్న మొత్తం విలువ రూ.29,714 కోట్లకు చేరింది. 2016 నవంబర్ నుంచి అత్యంత వేగంగా ఎక్కువ మొత్తంలో విదేశీ మార్కెట్‌కు తరలిన మొత్తం ఇది. 2016, నవంబర్‌లో విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు తరలించిన మొత్తం రూ.39,396 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగినప్పుడు చోటుచేసుకుంటున్న ఈ పరిణామం వల్ల కేవలం భారత్‌లో మాత్రమే కాదు చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులకు లోనవుతుంది. కరెంట్ అకౌంట్ ఖాతా తేడా పెరిగిపోవడం, దిగుమతి ద్రవ్యోల్బణం బాగా పెరగడం వంటి విపరిణామాలు ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తాయి. ఇదే సమయంలో మదుపర్లు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరిపే సమావేశం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించారు. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు ఈక్విటీలనుంచి రూ.2,100 కోట్ల మేర, రుణ మార్కెట్ల నుంచి రూ.30,000 కోట్ల మేర ఉపసంహరించుకున్నారు.