బిజినెస్

నౌకా రవాణా నిబంధనల సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: రైతుల ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, విదేశీ నౌకలు వ్యవసాయం, మత్స్యపరిశ్రమ, జంతు ఉత్పత్తులతో భారత తీర ప్రాంతాలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌లు జారీ చేస్తుంది. ఇదే సమయంలో భారత పౌరులు ఈ నౌకలను అద్దెకు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని కేంద్ర మతత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. సాగరమాల కింద సముద్ర ఆహార శుద్ధిని భారత్‌లోనే చేపట్టి విదేశాలకు ఎగుమతి చేయలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇప్పటివరకు భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తులను సింగపూర్‌లో శుద్ధి చేసి జపాన్ వంటి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే నూతన విధానం కింద భారత్‌కు చెందిన రిజిస్టర్డ్ సౌసైటీలకు నౌకలను అద్దెకు తీసుకోవడానికి అనుమతిస్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సంస్కరణల వల్ల రైతులకు సముద్ర రవాణా మొదలైన ఖర్చులు తగ్గి ఆర్థిక పరమైన ప్రయోజనం కలుగుతుందని గడ్కరీ వివరించారు. ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యం. దీన్ని సాధించడానికే భారత పభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది’ అని గడ్కరీ తెలిపారు. ఇందులో భాగంగానే 1958, మర్చెంట్ షిప్పింగ్ చట్టం లోని 407 సెక్షన్‌లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం సరకు రవాణా నౌకలు, లైసెన్స్ పొందాలంటే నౌకలో ఉన్న మొత్తం సరకులో 50 శాతం వరకు వ్యవసాయం, మత్స్య మరియు జంతు ఉత్పత్తులు ఉండాల్సిన అవసరం లేదు. అంతకు ముందు 50 శాతం వరకు ఈ ఉత్పత్తులు ఉంటేనే ఆయా నౌకలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఫర్ కోస్టల్ ట్రేడ్ వద్దనుంచి లైసెన్సులు మంజూరయ్యేవి. ఇప్పుడా అవసరంలేదు. ప్రభుత్వం ఇప్పటికే సాగరమాల కింద దేశంలో పోర్టుల అభివృద్ధి కోసం రూ.14 లక్షల కోట్ల విలువైన పనులను ప్రారంభించింది. రైలు, రోడ్డు మార్గాలతో పోల్చినప్పుడు కిలోమీటరుకు జలరవాణా ఖర్చు చాలా తక్కువ, లాభదాయకం కూడా. దీనివల్ల రైతు ఉత్పత్తులు ప్రపంచంలోని విస్తృత మార్కెట్ పరిధిలోకి వెళతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఒకే మార్గంలో కొనసాగుతున్న డిమాండ్ వల్ల, సరిపడ నౌకలు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా త్వరగా చెడిపోయే సరకు రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీన్ని అధిగమించేవిధంగా ప్రభుత్వం తీసుకున్న చర్య, రైతుల రక్షణ, సదుపాయాల కల్పన అనే అంశాలనుంచి, మార్కెట్ వాతావరణాన్ని మరింత విస్తృతం చేసేందుకు దోహదం చేస్తుందని వివరించారు. ఇది ప్రధానంగా దక్షిణ భారత దేశ రైతులకు (పత్తి రైతులు) ప్రయోజనకారిగా ఉంటుందని షిప్పింగ్ కార్యదర్శి గోపాలకృష్ణ వెల్లడించారు. అంతేకాదు విదేశీ పోర్టుల్లో ఒకనౌక నుంచి మరోనౌకకు భారతీయ సరకు మార్పిడి చేసే ప్రక్రియ 33 శాతం పెరగడమే కాదు, పెద్ద మొత్తంలో ఉపాధి కల్పన జరుగుతుంది. ముఖ్యంగా భారత తీరరేఖ వెంట నున్న సింగపూర్, మలేసియా, కొలంబో, జబెలాలి పోర్టుల్లో భారతీయ సరకు ఇకనుంచి అదనంగా 33 శాతం వరకు నౌకల్లోకి మార్పిడి జరుగుతుంది.