బిజినెస్

ఉపాధికి ఊతం.. సౌర ఇంధన రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: పునర్వినియోగ ఇంధన రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లివెత్తుతున్నాయి. ముఖ్యంగా చమురు ఇంధన రంగంలో మెరగవుతున్న పరిస్థితులు ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తున్నాయని తాజాగా వెలువడిన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ రంగాల్లో ఉద్యోగాలు వెతుక్కునే వారి సంఖ్య 2014 నుంచి గణనీయంగా పెరిగిందని, దాదాపు 76 శాతం మేర ఈ రంగంలో ఉపాధి అవకాశాల అనే్వషణలు పెరిగినట్టు తెలిపారు. సుస్థిర ఇంధన రంగంలో ఉద్యోగావకాశాల గురించి ఈ అధ్యయనం జరిగింది. సోలార్ డిజైన్ ఇంజనీర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఈ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. 2014లో సౌర ఇంధన పార్కులను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చమురు ఇంధన కర్మాగారాలు ఏర్పాటయ్యాయని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా భారత విద్యుత్ గ్రిడ్‌లో అత్యధిక స్థాయిలో విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం కలిగిన రంగంగా సౌర ఇంధన రంగం ప్రాచుర్యాన్ని సంతరించుకుందని తెలిపింది. ఈ రంగం ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న దృష్ట్యా ఇందులో ఉపాధిని వెత్తుక్కునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. పవన ఇంధన రంగంలో కూడా ఉపాధిని వెత్తుక్కునే వారి సంఖ్య 2014-17 సంవత్సరాల మధ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది. 2014 నుంచి పునర్వినియోగ ఇంధన రంగం అనూహ్య రీతిలో అభివృద్ధి చెందడం వల్ల విస్తృత ప్రాతిపదికన ఉపాధి అవకాశాలు కూడా వెల్లువెత్తుతూ వచ్చాయని ఈ అధ్యయని నివేదిక తెలిపింది. దేశంలో నిపుణులైన వ్యక్తుల ఉపాధి అవకాశాలకు ఈ రంగంలో అన్ని రకాలుగానూ ద్వారాలు తెరుచుకున్నాయని తెలిపింది.
ముఖ్యంగా మహిళలే పునర్వినియోగ ఇంధన రంగంలో క్రియాశీలక భూమిక పోషిస్తున్నందున 2022నాటికి మూడు లక్షల మూడు లక్షల మందికి పైగా ఈ రంగం ఉపాధిని అందించగలదన్న ఆశకు బలం చేకూరుతోందని తెలిపింది. పునర్వినియోగ ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టిని పెట్టడం వల్ల ముఖ్యంగా సౌర ఇంధన ఉత్పత్తి ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని, సోలార్ పార్కులు, సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇలా దేశవ్యాప్తంగా ఏర్పడినట్లు తెలిపింది.