బిజినెస్

మార్కెట్లకు ‘రేట్ల’ గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ స్టాక్ మార్కెట్లను ఆర్బీఐ సమీక్ష భయం అలముకుంది. ఈ వారంలో రేట్లు పెరిగే అవకాశం ఉంటుందన్న ఆందోళన సోమవారం జరిగిన మార్కెట్ లావాదేవీల్లో స్పష్టంగా కనిపించింది. దాంతో ఇనె్వస్టర్లు కూడా ఆచి తూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ప్రతిబింబిస్తూ సెనె్సక్స్ 215 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకులు, వినియోగ వస్తువులు, మూలధన వస్తువులకు చెందిన కంపెనీల షేర్లు 1.83 శాతం మేర విలువను కోల్పోయాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం సోమవారం మొదలు కావడంతో దాని ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు పెరిగేందుకే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. లావాదేవీల మొదట్లో బలంగా అడుగుపెట్టిన సెనె్సక్స్ ఒక దశలో 35,555.59 పాయింట్లకు చేరుకుంది. అయితే అనంతరం భారీగా విక్రయాలు జరగడంతో తిరోగమించింది. అంతిమంగా 215.37 పాయింట్లు కోల్పోయి 35,011.89 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా వివిధ దశల్లో ఊగిసలాడి అంతిమంగా 67.70 పాయింట్లు కోల్పోయి 10,628.50 వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు అత్యధిక స్థాయిలో 2.99 శాతం మేర విలువను కోల్పోయాయి. అలాగే అదానీ పోర్ట్స్ షేర్ విలువ 2.87 శాతం మేర నష్టపోయాయి. భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్ షేర్లు కూడా తిరోగమించాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ డాక్టర్ రెడ్డీస్ షేర్ అత్యధిక స్థాయిలో 2.86 శాతం మేర పుంజుకుంది. ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఆర్‌ఐఎల్, టీసీఎస్, ఎస్‌బ్యాంక్ షేర్లు కూడా లాభపడ్డాయి.