బిజినెస్

రుణ దాతలకు రూ.7400 కోట్ల వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: దివాళా ప్రక్రియ చట్టం పరిధిలో ఉన్న ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ సంస్థ రూ. 7400 కోట్ల వాటాలను రుణాలు ఇచ్చిన సంస్థలకు కేటాయించింది. ఇందులో ఎస్‌బిఐకు 37 శాతం వాటాలను దక్కాయి. మైనింగ్ దిగ్గజం వేదాంత స్టార్ సంస్థ ఈ కంపెనీని టేకోవర్ చేయనుంది. 740 కోట్లను 26 మంది రుణదాతలకు కేటాయించారు. ఇందులో ఎస్‌బిఐకు దాదాపు 271.61 కోట్ల వాటాలు వచ్చాయి. తాము వాటాల పంపిణీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోల్‌కొతా బెంచికి సమర్పించామని ఎలక్ట్రోస్టీల్ స్టీల్ సంస్థ పేర్కొంది. ఈ వివరాలను బిఎస్‌ఇకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 6.31 శాతం మేర 46.70 కోట్ల వాటాలు, కెనరాబ్యాంకుకు 5.15 శాతం మేర 38.13 కోట్ల వాటాలు, యూకో బ్యాంకుకు 5.02 శాతం మేర 37.17 కోట్ల వాటాలు దక్కాయి. ఎస్‌ఆర్‌ఇఐ ఇన్‌ఫ్రా ఫైనాన్స్ కంపెనీకి 4.43 శాతం, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు 4.63 శాతం మేర వాటాలు కేటాయించారు. మిగిలిన వాటాదారులకు 4 శాతం లోపు వాటాలు ఇచ్చారు. గత వారంలో వేదాంత లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ సంస్థను టేకోవర్ చేయడంలో భాగంగా ఎస్క్రో అకౌంట్‌లో రూ. 5320 కోట్లను డిపాజిట్ చేసింది. ఈ సంస్థ ప్రస్తుతం దివాళా ప్రక్రియ చట్టం 2016 పరిధిలో ఉన్న విషయం విదితమే.