బిజినెస్

మూడోవారమూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం బలపడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఈ వారంలో జరిపిన ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచినప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను యథాతథంగా కొనసాగించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 216.41 పాయింట్లు పుంజుకొని, 35,443.67 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 71.45 పాయింట్లు పుంజుకొని, 10,767.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రపంచ పరిణామాలు అనుకూలంగా ఉండటంతో పాటు దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) తగిన స్థాయిలో కొనుగోళ్లు జరపడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. జీ-7 దేశాల నేతల సమావేశం కెనడాలో కొనసాగుతుండటంతో అమెరికా, దాని ప్రధాన మిత్ర పక్షాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మదుపరులు పక్కన పెట్టి కొనుగోళ్లకు పూనుకోవడం వల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం బాగా బలపడ్డాయి. ప్రధాన సూచీలు బాగా పుంజుకున్నాయి.
బ్యాంకింగ్, స్థిరాస్తి రంగాల షేర్ల నేతృత్వంలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఈ వారం తొలి సెషన్‌లో దేశీయ మార్కెట్ సూచీలు పడిపోయాయి. అయినప్పటికీ, సెనె్సక్స్ మానసికంగా కీలకమయిన 35,000 పాయింట్ల స్థాయికి పైన ముగిసింది. అనిశ్చితితో సాగిన మంగళవారం సెషన్‌లోనూ సెనె్సక్స్ 108.68 పాయింట్లు పడిపోయి, 34,903.21 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే, బుధవారం ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు వెలువడిన తరువాత నిలకడగా సాగిన లావాదేవీలలో మార్కెట్లు బలపడ్డాయి. సెనె్సక్స్ 275.67 పాయింట్లు పుంజుకొని, 35,178.88 పాయింట్ల వద్ద ముగిసింది. ఇలా సెనె్సక్స్ మానసికంగా కీలకమయిన 35,000 పాయింట్ల స్థాయికి ఎగువన స్థిరపడింది. ప్రపంచ పరిణామాలు అనుకూలంగా ఉండటంతో గురువారం కూడా దేశీయ మార్కెట్లు బలపడ్డాయి. శుక్రవారం అనిశ్చితితో సాగిన లావాదేవీలలో కీలక సూచీలు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ఐటీ, ఫార్మా షేర్ల ధరలు పెరిగినప్పటికీ, బ్యాంకింగ్ షేర్ల ధరలు పడిపోవడం వల్ల కీలక సూచీలు పైకి ఎగబాకలేకపోయాయి. ప్రపంచ పరిస్థితులు కూడా నిరుత్సాహకరంగా ఉండటం శుక్రవారం కీలక సూచీల ఎదుగుదలను నివారించింది.
సెనె్సక్స్ ఈ వారం 35,503.24 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, 35,628.49- 34,784.68 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 216.41 పాయింట్ల (0.61 శాతం) ఎగువన 35,443.67 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం వారం 302.39 పాయింట్లు (0.87 శాతం) పుంజుకుంది. నిఫ్టీ ఈ వారం 10,765.95 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 10,818.00- 10,550.90 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 71.45 పాయింట్ల (0.67 శాతం) పైన, 10,767.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ క్రితం వారంలో 91.05 పాయింట్లు పుంజుకుంది.
ఆరోగ్య సంరక్షణ, లోహ, చమురు- సహజ వాయువు, ఐటీ, టెక్నాలజి, వాహన, పీఎస్‌యూ, స్థిరాస్తి రంగాల షేర్లు ఈ వారంలో బలపడ్డాయి. పవర్, క్యాపిటల్ గూడ్స్, ఐపీఓ, కన్స్యూమర్ డ్యూరేబుల్స్, బ్యాంకెక్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు కలిసి ఈ వారంలో నికరంగా రూ. 2,408.80 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.