బిజినెస్

దివాలా సంస్థలను బతికించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 9: దివాళాప్రక్రియ చట్టం పరిధి కిందకు వచ్చే కేసులకు సంబంధించి వివిధ పరిశ్రమలు, సంస్థలకు పూర్వటి వైభవం తెచ్చే విధంగా, ఆ సంస్థలు బతికే విధంగా చూడాలనేదే ఈ చట్టం ఉద్దేశ్యమని ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంకరప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ ఎంఎస్ సాహూ తెలిపారు. దివాళా చట్టం కిందకు వచ్చే సంస్థలను మూసివేసే దృష్టితో చర్యలు తీసుకోరాదన్నారు. వీటిని బతికించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సంస్థల్లోని వాటాదారుల ప్రయోజనాలను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉండాలన్నారు. కాని తాను ఆశించిన వాతావరణం కనపడడం లేదన్నారు. శనివారం ఇక్కడ సిఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, దివాళా చట్టం వల్ల సంస్థలకు, వాటాదారులకు ప్రయోజనం కలిగించే విధంగా చూస్తామని ఆయన చెప్పారు. ఈ సంస్థలను మూసివేయడం కంటే, బతికించుకోవడం వల్ల ఎక్కువ విలువ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు ఇంతవరకు దివాళా చట్టం కింద దాదాపు 850 కేసులు వచ్చాయన్నారు. ఇందులో 130 కేసులు లిక్విడేషన్ లేదా రెజల్యూషన్‌కు చేరువలో ఉన్నాయన్నారు. కాగా ఇందులో వంద కేసులు మా త్రం మూసివేతకు చేరువలో ఉన్నాయన్నారు. ఈ చట్టంలో ముఖ్యమైనది కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ కీలకపాత్ర వహిస్తుందన్నారు. దివాళా చట్టం కింద రెఫర్ చేసిన పరిశ్రమలను నడిపేందుకు వచ్చే అర్హులైన వారిని క్రెడిటర్స్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. ఆలస్యంగా బిడ్స్‌ను దాఖలు చేసిన వారితో మంతనాలు జరిపేందుకు అవకాశం లేకుండా త్వరలో చట్టంలో సవరణలు తేనున్నట్లు చెప్పారు. ఎన్‌సిఎల్‌టి కోల్‌కొతా బెంచి సభ్యుడు కెఆర్ జినాన్ మాట్లాడుతూ, కార్పోరేట్ సంస్థలు దివాళా తీసేందుకు కారణమైన బకాయిదార్లు , ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీ చట్టం అమలుకాకుండా, ఉద్దేశ్యాలు నెరవేరకుండా అడ్డుపడుతున్నారని, సహకరించడం లేదని చెప్పారు. ఈ కోడ్ అమలు విధి విధానాలు ఇం కా ప్రాథమిక దశలో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో స్ఫూర్తితో అమలు చేయాల్సి ఉందన్నారు. బ్యాంకుల్లో తనఖాకు వెళ్లిన ఆస్తులుకు సంబంధించి, ఈ చట్టం అమలుకు సంబంధించి అనేక పర్యాయాలు సమీక్షించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.