బిజినెస్

మొండి బకాయిలు రాబడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 9: ఈ ఏడాది దివాళా చట్టం పరిధి కిందకు వెళ్లి సంస్థల నుంచి రూ. 30 వేల కోట్ల మొత్తాన్ని రాబట్టుకునే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా డిఎండి పల్లవ్ మహాపాత్ర చెప్పారు. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీ కోడ్ పరిధిలోకి వెళ్లిన కొన్ని సంస్థల నుంచి ఈ మొత్తం రాబట్టుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన సిఐఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విలేఖర్లతో ముచ్చటించారు. ఇటీవల తమకు మొండి బకాయిలు పడిన రెండు సంస్థలను ఐబిసి పరిధిలోకి వెళ్లాయన్నారు. భూషణ్ స్టీల్ టాటా స్టీల్ ప్లాంట్ నుంచి రూ.8500 కోట్లను వసూలు చేయగలిగిందన్నారు. ఎలక్ట్రో స్టీల్ వేదాంత డీల్ వల్ల మరో రూ.6వేల కోట్ల బకాయిలు తమ ఖాతాలో చేరుతాయన్నారు. మొత్తం తమ బ్యాంకుకు రూ.78 వేల కోట్ల వరకు బకాయిలు వసూలు కావాల్సి ఉన్నాయన్నారు. ఎస్‌బిఐకు నిరర్ధక ఆస్తుల విలువ రూ.2.20 లక్షల కోట్లకు చేరిందన్నారు. కాగా మరో రూ. 10వేల కోట్లను ఏక మొత్తం సెటిల్‌మెంట్ కింద వసూలు చేయనున్నట్లు చెప్పారు. ఐబిసి చట్టం కింద 250 కేసులపై ఫైల్ చేసినట్లు ఆయన చెప్పారు. ఐబిసి పరిధి కింద దాఖలు చేసిన పైలింగ్ కేసుల బకాయిలు మొత్తం విలువ రూ.95వేల కోట్లన్నారు. మొత్తం బకాయిలు వసూలు కావని, బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి 30 శాతం వరకు సొమ్మును వదులు కోవాల్సి ఉంటుందన్నారు.