బిజినెస్

రెండేళ్లలో 8 శాతానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: వచ్చే రెండేళ్లలో స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8 శాతానికి చేరుకుంటుందని, దేశంలోవృద్ధిరేటు బాగుందని, సంస్కరణలు జోరందుకున్నాయని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) పేర్కొంది. దేశ ఆర్థిక రంగం జోష్ మీద ఉందని, గత కొనే్నళ్లుగా సంస్కరణలు వేగంపుంజుకున్నాయని, కొన్ని సర్దుబాట్లు కూడా చోటు చేసుకుంటున్నాయని సిఐఐ నివేదికలో పేర్కొంది. దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని, పెట్టుబడుల వినియోగం కూడా ఆశాజనకంగా ఉందని సిఐఐ అధ్యక్షుడు రాకేష్ భారతి మిటల్ చెప్పారు. ఇటీవల రూ.50వేల కోట్ల మేరపెట్టుబడులు రానున్నట్లు సిఐఐ తెలిపింది. సిఇవోల సమావేశానన్ని ఇటీవల సిఐఐ నిర్వహించింది. వారి నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం జిడిపి ఈ ఏడాది ఏడు శాతంపైగా ఉంటుందన్నారు. కాగా పదిశాతం మంది సిఇవోలు మాత్రం 7.5 శాతం మేర జిడిపి నమోదు కావచ్చని తెలిపినట్లు సిఐఐ పేర్కొంది. తయారీ రంగంలో డిమాండ్ బాగుందని, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉందని సిఐఐ పేర్కొంది. ఇన్‌పుట్ వ్యయం పెరుగుతోంది. ఆటోమోటీవ్‌లు, స్టీలు, సిమెంట్, యంత్రపరికరాల రంగంలో వృద్ధిరేటు సానుకూలంగా ఉంది. ఐటి రంగంలో పనితీరు అద్భుతంగా ఉందని, మంచి ఫలితాలు వస్తాయని సిఇవోలు అభిప్రాయపడ్డారు. దేశంలో స్మార్ట్‌పోన్ల తయారీ కంపెనీల ఏర్పాటు కూడా వేగవంతమైంది.