బిజినెస్

15 రోజులకోసారి డాటా నివేదికలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలోని పేమెంట్ సంస్థలు ప్రతి 15 రోజులకోసారి డాటా స్టోరేజి నివేదికలను ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశించింది. పేమెంట్ సంస్థలు డాటా స్టోరేజీపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ ఏడాది 6న ఆర్‌బీఐ అన్ని పేమెంట్ సంస్థలకు డాటాస్టోరేజీపై నివేదికలు ఇవ్వాలని కోరింది. తాజాగా ఈ నివేదికలను ప్రతి 15 రోజులకోసారి ఇవ్వాలని ఆర్‌బిఐ కోరింది. పేమెంట్ గేట్‌వేలు, పేమెంట్ బ్యాంకులు డాటా వివరాలను తెలియచేయాలని పంపిన లేఖలు అందినట్లు పేమెంట్ సంస్థల అధికారులు చెప్పారు. ఎండ్ టు ఎండ్ లావాదేవీల వివరాలు, పేమెంట్ వ్యవస్థల తీరుపై నివేదిక ఇవ్వాలని కోరాయి. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగ ఉన్నత ప్రమాణాలకు లోబడి పేమెంట్ సంస్థలు పనిచేయాలని కోరింది. డాటా అపహరణ కాకుండా పూర్తిరక్షణ వలయం ఉండాలని ఆర్‌బీఐ భావిస్తోంది. డాటావివరాలు లీక్ అయితే తీవ్రపరిణామాలు ఉంటాయి. బ్యాంకులు, పేమెంట్ సంస్థలు కస్టమర్ల వివరాలను జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరం ఉంది.