బిజినెస్

రూ. 60,207.86 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలోని మొదటి పది కంపెనీల్లో ఆరు కంపెనీల మార్కెట్ వాల్యూయేషన్‌ను గణనీయంగా పెంచుకున్నాయి. ఎప్పటిలాగానే రిలయన్స్ మార్కెట్ వాల్యూయేషన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఆరు కంపెనీలు కలిపి రూ. 60,207.86 కోట్లను పెంచుకున్నాయి. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 34,378.16 కోట్ల నుంచి రూ. 6,23,070.31 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ విలువ రూ. 8627.3 కోట్ల నుంచి రూ. 2,75,145.41 కోట్లకు, టాటా కనె్సల్టెన్సీ సర్వీసస్ విలువ రూ. 6,106.57 కోట్ల నుంచి రూ. 6,69,311.51 కోట్లకు పెరిగింది. ఎం క్యాప్ ఎస్‌బిఐ విలువ రూ. 5310 కోట్ల నుంచి రూ. 2,43,373.50 కోట్లకు, మారుతి సుజుకి సంస్థ విలువ రూ. 4,638.44 కోట్ల నుంచి రూ. 2,70,231.76 కోట్లకు పెరిగింది. హిందూస్తాన్ యూనీలీవర్ విలువ రూ. 1,147.26 కోట్ల నుంచి రూ. 3,45,257.69 కోట్లకు , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు విలువ రూ.15,476.62 క్లో నుంచి రూ. 5,33,702.46 కోట్లకు పెరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంకు విలువలో ఎటువంటి మార్పు లేదు. గత వారంరోజుల్లో బిఎస్‌ఇ సెనె్సక్స్ 216.41పాయింట్లు పెరిగింది.