బిజినెస్

జూలైలోగా కొత్త టెలికం విధానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: వచ్చే నెలాఖరుకు కొత్త టెలికాం పాలసీని ప్రకటిస్తామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ, నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీని వచ్చే నెలాఖరులోపల కేంద్రం ఆమోదిస్తుందన్నారు. ఈ పాలసీపై ముసాయిదా సిద్ధమైందన్నారు. ఈ ముసాయిదా నుంచి జారీచేశామన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలోకి రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. నాలుగు మిలియన్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రతి ఇంటికి 50 ఎంబిపిఎస్ డాటాను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. డిజిటల్ పాలసీపై ముసాయిదాను టెలికాం కమిషన్‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కమిషన్ సమావేశం ఈ నెల 29వ తేదీన జరగనున్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లలో టెలికాం రంగం నిలదొక్కుకునేందుకు వీలుగా చర్యలు తీసుకున్నామన్నారు. పారదర్శకత, సుపరిపాలన వల్లనే సాధ్యమైందన్నారు. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా గ్రామ పంచాయితీలకు వైఫై సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 2020 నాటికి రూ. 7330 కోట్లతో 4072 మొబైల్ టవర్లను నెలకొల్పనున్నట్లు చెప్పారు. పది లక్షల వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏపటు చేస్తున్నామన్నారు. పది కోట్ల రూపాయల వ్యయంతో బిఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో 25వేల వైఫై హాట్‌స్పాట్స్, ఏడు వేల వరకు ఇ-చౌపాల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రూ.2250 కోట్ల వ్యయంతో అండమాన్, నికోబార్ దీవులు, లక్ష్యదీవుల్లో సబ్‌మెరైన్, మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో టెలికాం రంగంలో రూ.10,834 కోట్లతో వౌలికసదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. 650 ఇండియా పోస్టు పేమెంట్స్ బ్రాంచిల ఏర్పాటుపై ఆర్‌బిఐ అనుమతి లభించాల్సి ఉందన్నారు. దీని వల్ల 1.5 లక్షల పోస్ట్ఫాసుల మధ్య అనుసంధానం ఏర్పాటు చేస్తామన్నారు.