బిజినెస్

మరిన్ని అధికారాలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ప్రభుత్వ రంగ బ్యాంకుల పర్యవేక్షణకు ఎక్కువ అధికారాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కల్పించాలని ఆ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆదేశంపై ఆ కమిటీ సమావేశానికి మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బ్యాంకులపై సరైన నియంత్రణ ఆర్‌బీఐకు లేదన్నారు. ఆర్‌బీఐ మరిన్ని అధికారాలు ఇస్తే పరిస్థితిని చక్కబెట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం ఎస్‌బిఐతో కలుపుకుని మొత్తం 21 బ్యాంకులు ఉన్నాయన్నారు. బ్యాంకుల ఉమ్మడి నష్టాలు ఈ ఏడాది మార్చి వరకు రూ. 87,300 కోట్ల వరకు చేరుకున్నాయన్నారు. కేవలం రెండే రెండు బ్యాంకులు విజయాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు మాత్రమే లాభాలు గడించాయని వివరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో నీరవ్ మోదీ రెండు బిలియన్ డాలర్ల స్కాంకు సంబంధించి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులు అనేక ప్రశ్నలను సంధించినట్లు తెలిసింది. ప్రతి బ్యాంకు ఆడిట్‌ను చూడడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విలువ రూ. 8.31 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. బ్యాంకుల మొండి బకాయిలు, నష్టాలు, ఫ్రాడ్స్, నిధుల సంక్షోభం, ఎగవేతదారులు, ఇతర అంశాలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అనేక చిక్కు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఈ కమిటీలో ఉన్న మాజీ మంత్రి, కమిటీ అధ్యక్షుడు వీరప్ప మొయిలీ మాట్లాడుతూ దేశంలోని అనేక ఎటిఎంలలో నగదు కొరతకు కారణాలేమిటని ప్రశ్నించారు. నగదు కొరత తీర్చేందుకు ఎందుకు సకాలంలో చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడుతామని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీకోడ్ (ఐబిసి) వల్ల బ్యాంకుల పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన తెలిపారు.