బిజినెస్

భారీగా.. చిల్లర ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గత నాలుగు నెలల కాలంలో రికార్డు స్థాయిలో 4.87 శాతానికి చేరుకుంది. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాల ధరలు పెరిగాయి. వీటికి పెట్రో ధరల రేట్లు తోడయ్యాయి. వినిమయ ధరల సూచికను విశే్లషిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 4.58 శాతం నమోదైంది. గత ఏడాది మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువలో తక్కువగా కేవలం 2.18 శాతం నమోదైంది. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 5.7 శాతం నమోదైంది. ఈ వివరాలను సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్‌ఒ) విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పండ్లకు సంబంధించిన ధరల సూచిక 9.65 శాతం నమోదుకాగా, మే నెలకు 12.33 శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు కూడా ఇంతే . ఇవి మండుతున్నాయి. నెల రోజుల్లో 7.29 శాతం నుంచి 8.04 శాతానికి పెరిగాయి. తృణ ధాన్యాలపైన కూడా ద్రవ్యోల్బణం ప్రభావం పడింది. 2.56 శాతంన ఉంచి 2.78 శాతానికి పెరిగాయి. నూనె ధరలు ప్రియమయ్యాయి. 2.11 శాతం నుంచి 2.46 శాతానికి పెరిగాయి. ఇంధన ధరలు 5.24 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును ఖరారు చేయడానికి వినిమయ ధరల సూచికను పరిగణనలోకి తీసుకుంటుంది. ఆర్‌బీఐ ఇటీవల రెపో రేటును 6.25 శాతానికి పెంచింది. గత నాలుగేళ్లలో తొలిసారిగా రెపో రేటును ఇంత స్థాయిలో పెంచడం ఇదే తొలిసారి. ఆర్‌బీఐ ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 4.8 నుంచి 4.9 శాతం వరకు, రెండవ ఆరు నెలల కాలంలో 4.7 శాతం వరకు ద్రవ్యోల్బణం నమోదవుతుందని అంచనా వేసింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమిటీ రెపోరేటును తటస్థ వైఖరితో 0.25 శాతం వరకు పెంచింది.