బిజినెస్

పరిగెడుతున్న పారిశ్రామికోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) ఈ ఏడాది ఏప్రిల్‌లో 4.9 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఐఐపి 3.2 శాతం నమోదైంది. తయారీ రంగం, మైనింగ్ సెక్టార్, భారీ యంత్రపరికరాల రంగంలో వృద్ధిరేటు ఆశాజనకంగా ఉంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐఐపి పరుగులుపెట్టింది. ఈ ఏడాది మార్చినెలలో ఐఐపి 4.6 శాతం నమోదైంది. అంతకుముందు ఈ ఏడాది అదే కాలంలో ఐఐపి 4.3 శాతం రికార్డయింది. ఈ వివరాలను సెంట్రల్ స్టాటస్టిక్స్ ఆఫీస్ (సిఎస్‌ఓ) వెల్లడించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో తయారీ రంగం వాటా 77 శాతానికి చేరింది. అందుకే తయారీ రంగం వృద్ధిరేటు ఈ ఏడాది ఏప్రిల్‌లో 5.2 శాతం నమోదైంది. గత ఏడాది ఇదేకాలంలో తయారీ రంగం వృద్ధిరేటు 2.9శాతం నమోదైంది. మైనింగ్ రంగాన్ని విశే్లషిస్తే గత ఏడాదితో ఇదే కాలంలో పోల్చితే 3 శాతం నుంచి 5.1 శాతానికి ఎగబాకింది. వినిమయ వస్తువుల రంగంలో కూడా గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుంది. ఈ వివరాలను అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు. భారీ యంత్రపరికరాల రంగం విస్తరించింది. దీని వల్ల పెట్టుబడులు పెరిగాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మొత్తం 23 గ్రూపులు ఉన్నాయి. ఇందులో 16 గ్రూపులు అభివృద్ధిలో ఉరకలేశాయి. తయారీ రంగాన్ని విశే్లషిస్తే, కంప్యూటర్, ఎలక్ట్రానిక్, ఆఫ్టికల్ ఉత్పత్తుల రంగంలో 27.5 శాతం వృద్ధిరేటు, మోటార్ వాహనాల రంగంలో 21.9 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి. ఆహార ఉత్పత్తుల తయారీ రంగంలో 15.7 శాతం వృద్ధిరేటు నమోదైంది. కాగా ఇతర మ్యానుఫ్యాక్చరింగ్‌లో 30.7 శాతం, రెడీమేడ్ వస్త్రాలమార్కెట్‌లో 13.4 శాతం ప్రతికూల వృద్ధిరేటు వచ్చింది. ప్రింటింగ్ విభాగంలో 10.3 శాతం ప్రతికూల రేటు నమోదైంది. వౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగంలో వస్తువుల వృద్ధిరేటు 7.5 శాతం నమోదైనట్లు ఐసిఆర్‌ఏ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ చెప్పారు.