బిజినెస్

ఎస్సీ, ఎస్టీల పరిశ్రమల నుంచి కొనుగోళ్లు అంతంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: ఎస్సీ, ఎస్టీవర్గాలకు చెందిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు అవసరమైన సామాగ్రిని సేకరించిన రేటు 2017-18లో కేవలం 0.47 శాతం మాత్రమే. గత ఏడాది దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం రూ. 26102.45 కోట్ల ఉత్పత్తులను సేకరించాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ పరిశ్రమల ఉత్పత్తుల వాటా రూ.540.75 కోట్లు. ఈ వివరాలను ఎంఎస్‌ఎంఇ సంబంధ్ పోర్టల్ డాటా పేర్కొంది. 2012లో అప్పటి ప్రభుత్వం పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం మంత్రులు, ప్రభుత్వ శాఖలు, కేంద్రప్రభుత్వ సంస్థలు ఎస్సీ, ఎస్టీలకు చెందిన సంస్థల నుంచి కనీసం 4 శాతం ఉత్పత్తులను సేకరించాలని నిర్దేశించింది. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేయాలని, వారికి సకాలంలో చెల్లింపులుచేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పరిశ్రమల నుంచి ఉత్పత్తుల కొనుగోలులో జాప్యం, ఉదాసీన వైఖరి పనికిరాదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు లేఖ కూడా రాశారని కేంద్ర చిన్న, మధ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎకె పాండా పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం రూ. 1,15,276.95 కోట్ల ఉత్పత్తులను సేకరించాయి. ఇందులో చిన్న, సూక్ష్మ పరిశ్రమల ఉత్పత్తుల వాటా రూ. 26,102.45 కోట్లని చెప్పారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సంబంద్ పోర్టల్‌లో డాటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. 2012లోనే ప్రకటించిన ప్రొక్యూర్‌మెంట్ పాలసీలో సమగ్రమైన విధానాలను నిర్దేశించారు. మొత్తం కొనుగోళ్లలో 20 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి ఉండాలని పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని శాఖలకు సమగ్ర సమాచారం కూడా ఇచ్చారు.