బిజినెస్

దిగజారిన పీఎన్‌బీ సీఏఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: వరుస స్కాంలతో తలడిల్లుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ప్రతి రోజూ ఒక దెబ్బ తగులుతోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం క్యాపిటల్ అడెక్వెసీ రేషియో (సిఏఆర్) 11.5 శాతంపైన ఉండాలి. గత ఏడాది ఎక్కువ నష్టాలు చవిచూసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిఏఆర్ మార్చి 31వ తేదీతో 9.20 శాతానికి దిగజారింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి 11.66 శాతం సాధించింది. కన్సాలిడేషన్ ప్రకారం చూస్తే సిఏఆర్ 9.82 శాతం నమోదైంది. గత ఏడాది ఇదే కాలానికి 11.98 సిఏఆర్ నమోదైంది. సిఏఆర్ తగ్గడం పట్ల బ్యాంకు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల కంటే దిగువకు ఈ బ్యాంకు సిఏఆర్ పడిపోయింది. నీరవ్ మోదీ అనే వజ్రాల వ్యాపారి ఈ బ్యాంకుకు రూ.14వేల కోట్ల మేర బకాయిలు పడి చెల్లించకుండా దేశం నుంచి పరారయ్యాడు. జనవరి-మార్చి నెలల్లో ఈ బ్యాంకు రూ. 13,416 కోట్ల నష్టాలను చవి చూసింది. ఈ బ్యాంకు రూ.6586.11 కోట్లను ఇతరదేశాల బ్రాంచిలకు స్విఫ్ట్ పద్ధతి ద్వారా బదలాయించింది. నీరవ్ మోదీ తప్పుడు విధానాలకు బ్యాంకు బలైంది. ఈ బ్యాంకు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.8వేల కోట్ల మేర రికవరీ అయ్యే అవకాశం ఉందని, కోలుకుంటుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. దివాలా కేసులను ఎన్‌సిఎల్‌టికి రెఫర్ చేయడం వల్ల బ్యాంకు ఆర్థికపరిస్థితి రానున్న రోజుల్లో మెరుగుపడుతుందంటున్నారు.