బిజినెస్

మళ్లీ భారత్-22 ఈటీఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: ఈ నెల 19వ తేదీన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ రెండవ సారి భారత్-22 ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)ను మార్కెట్లో విడుదల చేస్తోంది. ఈ ఫండ్ ద్వారా రూ. 8400 కోట్ల నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి రోజు 19వ తేదీన యాంకర్ ఇనె్వస్టర్లకు , రెండవ రోజు నుంచి సంస్థాగత, రిటైల్ ఇనె్వస్టర్లకు ఇష్యూను ఆఫర్ చేస్తారు. ఈ నెల 22వ తేదీ వరకు ఇష్యూ అమలులో ఉంటుంది. ఇష్యూపైన ఇనె్వస్టర్లకు 2.5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తారు. గత ఏడాది నవంబర్ నెలలో కేంద్రప్రభుత్వం భారత్-22 ఇటిఎఫ్‌ను ఆఫర్ చేసింది. ఈ ఫండ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఐటిసి, యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టి వాటాలు ఉన్నాయి. ఈ ఫండ్‌కు రూ.32వేల మేర బిడ్స్ వచ్చినా, ప్రభుత్వానికి మాత్రం రూ. 14,500 కోట్ల ఫండ్‌ను సేకరించగలిగింది. కొత్త భారత్ ఇటిఎఫ్-22లో ఓఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, ఎస్‌బిఐ, బిపిసిఎల్, కోల్ ఇండియా, నాల్కో సంస్థలు ఉన్నాయి. ఇంకా భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్‌బిసిసి, ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పిసి, ఎస్‌జెవిఎన్‌ఎల్, గెయిల్, పిజిసిఐఎల్, ఎన్‌ఎల్‌సి ఇంయా సంస్థలు కూడా ఈ ఫండ్‌లో లిస్టయ్యాయి.