బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 4 జీ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాష్ట్రంలో 34 జీ2 సేవలు అందించేందుకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) నిర్ణయించింది. తొలుత ఈ సేవలు పైలట్ ప్రాజెక్ట్‌గా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం, ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో 2018 ఆగస్టు కంటే ముందు ప్రారంభిస్తామని బిఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ సర్కిల్ సీజీఎం వి. సుందర్ తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్ చేపడుతున్న కొత్త పథకాలు, కొత్త కార్యక్రమాలను వివరించేందుకు బుధవారం ఆయన నాంపల్లిలోని దూరసంచార్ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2018 డిసెంబర్ చివరి వరకు హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 4 జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, వచ్చే సంవత్సరం హైదరాబాద్‌లో ప్రవేశపెడతామని తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ 2 జీ, 3 జీ సేవలను అందిస్తోందన్నారు. మొబైల్ సేవల్లో టాప్‌అప్ విధానంలో 160 రూపాయల ప్లాన్‌లో అన్ని ఆదివారాల్లో ఫుల్‌టాక్‌టైం ఇస్తున్నామని, 310 ప్లాన్‌లో అన్ని రోజుల్లో ఫుల్ టాక్ టైం ఇస్తున్నామన్నారు. 3పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్2 ను కొత్తగా ప్రీపెయిడ్‌లో ప్రవేశపెడుతున్నామని, ఇందులో 144 రూపాయలు (30 రోజులు), 792 రూపాయలు (180 రోజులు), 1584 రూపాయలు (365 రోజులు) ఓచర్లపై 2 జీబీ డటా/రోజూ ఉంటుందని, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా ఉంటాయన్నారు. పతంజలి దుకాణాల్లో ఈ ఓచర్లు విక్రయానికి ఉంచుతున్నామన్నారు. అలాగే 3అనంత-1052, 3అనంత ప్లస్-3282 పథకాలను ప్రీపెయిడ్‌లో పవేశపెడుతున్నామన్నారు. పోస్ట్‌పెయిడ్‌లో 3ఘర్ వాపసీ ప్లాన్2 (ఎఫ్‌ఎంసీ-399) అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయని వివరించారు. ఎస్‌టివీలో నాలుగు కొత్త పథకాలు (ఈద్‌ముబారల్, డటా సునామీ తదితరాలు) ప్రవేశపెట్టామన్నారు. ఛానల్ పార్టనర్లకు ఇచ్చే కమిషన్‌ను 12 శాతానికి పెంచామని సుందర్ వివరించారు. ల్యాండ్ లైన్‌కు సంబంధించి బీబీ కాంబో ప్లాన్ 1199 ప్రవేశపెట్టామని సుందర్ తెలిపారు. ఇలా ఉండగా కొత్తగా నాలుగు రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను (బీబీ 99, బీబీ 199, బీబీ 299, బీబీ 491) ప్రవేశపెట్టామన్నారు.