బిజినెస్

మూడోరోజూ లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో స్వల్పంగా లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 47 పాయింట్లు పుంజుకొని, 35,739.16 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి, 10,856 పాయింట్ల వద్ద స్థిరపడింది. టెక్నాలజి, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు చెందిన షేర్ల ధరలు పెరగడం కీలక సూచీలు స్వల్పంగా పుంజుకోవడానికి దోహదపడింది. తయారీ (మాన్యుఫాక్చరింగ్), మైనింగ్ రంగాలలో వేగవంతమయిన వృద్ధి కారణంగా దేశంలో ఏప్రిల్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) 4.9 శాతం పెరిగినట్లు మంగళవారం సాయంత్రం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత వెలువడిన అధికార గణాంకాలు సూచించడంతో బుధవారం ఉదయం సెషన్‌లో మార్కెట్‌లో కొనుగోళ్లు పుంజుకున్నాయి. అయితే, ఆహార ధాన్యాల ధరల పెరుగుదల కారణంగా మే నెలలో చిల్లర (రిటెయిల్) ద్రవ్యోల్బణం 4.87 శాతానికి పెరగడం మదుపరులలో ఆందోళనకు దారితీసింది. సెనె్సక్స్ బుధవారం ఉదయం పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయి, దేశీయ సంస్థాగత మదుపరుల (డీఐఐల) నుంచి అందిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రా-డేలో 35,877.41 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, సెషన్ చివరలో మదుపరులు అమ్మకాలకు దిగడంతో అంతకు ముందు ఆర్జించిన లాభాలను చాలామట్టుకు కోల్పోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 46.64 పాయింట్ల (0.13 శాతం) పైన, 35,739.16 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం రెండు రోజుల్లో కలిసి ఈ సూచీ 248.85 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ బుధవారం క్రితం ముగింపుతో పోలిస్తే 13.85 పాయింట్ల (0.13 శాతం) ఎగువన 10,856.70 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 10,893.25- 10,842.65 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, మంగళవారం నాటి లావాదేవీలలో డీఐఐలు నికరంగా రూ. 1,327.45 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 1,168.88 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. ఆసియా మార్కెట్లలో బుధవారం మిశ్రమ ధోరణి కనిపించింది. మదుపరులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే విధాన నిర్ణయాల కోసం వేచిచూస్తున్న తరుణంలో యూరోపియన్ మార్కెట్లు తొలి లావాదేవీలలో లాభాలు ఆర్జించాయి.
సెనె్సక్స్ ప్యాక్‌లోని డాక్టర్ రెడ్డీస్ బుధవారం అత్యధికంగా 2.82 శాతం లాభపడింది. టీసీఎస్ తరువాత స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థలలో సన్ ఫార్మా, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, రిల్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, యెస్ బ్యాంక్, కోల్ ఇండియా ఉన్నాయి. నష్టపోయిన సంస్థలలో టాటా స్టీల్, అదాని పోర్ట్స్, హెచ్‌యూఎల్, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి.