బిజినెస్

మళ్లీ పెరగనున్న రెపో రేట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 13: ఆర్‌బీఐ రెపోరేట్లు ఆగస్టు నెలలో మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం రేటు మే నెలలో 4.87 శాతానికి చేరడంతో, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఆగస్టునెలలో ద్రవ్యపరపతి కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటును పెంచవచ్చని నిపుణులంటున్నారు. రెపోరేటును పెంచడం వల్ల విదేశీపెట్టుబడులు మందగిస్తాయని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) వర్గాలు భావిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. రెపోరేటును పెంచడం వల్ల వృద్ధిరేటు నత్తనడకన సాగుతుంది. ఆగస్టు మొదటి వారంలో జరిగే ద్రవ్య పరపతి మీటింగ్ తర్వాత రెపో రేటు అదనంగా 0.25 శాతం పెరగవచ్చని ఫ్రెంచ బ్రోకరేజ్ బిఎన్‌పి పారిపాన్ నిపుణులు తెలిపారు. ఆర్‌బీఐ తప్పనిసరిగా రెపోరేటును పెంచుతుందని యుబిఎస్ సెక్యూరిటీస్ తెలిపింది. ముడి చమురు ధరలు ఇదే పరిస్థితిలోకొనసాగితే, ద్రవ్యోల్బణం పెరుగుతుందన్నారు. రైతులకు గిట్టుబాటుధరలు పెంచే సమయం ఆసన్నమైంది. ఈ రేట్లను పెంచడం వల్ల బ్యాంకింగ్ రంగంపై ప్రభావం ఉంటుంది. జర్మన్ బ్రోకరేజ్ సంస్థ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు కనపడడం లేదనే సంకేతాలు అందుతున్నాయని ఆ సంస్థ నిపుణులు పేర్కొన్నారు. చిల్లర ద్రవ్యోల్బణం గత నాలుగు నెలల్లో రికార్డు స్థాయిలో 4.87 శాతానికి పెరిగింది. దీని వల్ల ఆహార పదార్ధాలు, కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాల రేట్లు పెరిగాయి. దీనికి ముడి చమురు ధరలు పెరగడం కూడా కారణమైంది.