బిజినెస్

3,000కోట్ల నిధుల సేకరణలో ఐఎఫ్‌సీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో పురాతనమైనదైన ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సీఐ) నిధుల వేటలో పడింది. ఆర్థిక విస్తరణ పథకంలో భాగంగా కనీసం రూ.3000 కోట్లను బాండ్లు తదితర రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో, నెలకు రూ.500 కోట్ల చొప్పున రుణాలను మంజూరు చేయాలని యోచిస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి నిధుల సేకరణ అత్యవసరమైంది. బాండ్లు లేదా ఇతర విధానాల్లో మూడు వేల కోట్ల రూపాయలు సేకరించాలని తీర్మానించామని, ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఈఎస్ రావు పీటీఐతో మాట్లాడుతూ తెలిపారు. సక్రమంగా పని చేయని లేదా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్న సంస్థల నుంచి సుమారు 2,000 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాల లక్ష్యాన్ని చేరాలంటే, ఆర్థిక విస్తరణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. అందుకే, బాండ్లను విడుదల చేయాలని తీర్మానించినట్టు చెప్పారు.