బిజినెస్

తగ్గనున్న డిఎపి, పొటాష్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 2: కీలక ఎరువులైన డైఅమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి), మురియత్ ఆఫ్ పొటాష్ (ఎమ్‌ఒపి), నైట్రోజన్ ఫాస్ఫేట్ అండ్ పొటాష్ కంపోజిషన్ (ఎన్‌పికె) ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఇక్కడ కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ‘డిఎపి, ఎమ్‌ఒపి, ఎన్‌పికె ఎరువుల ధరలు గడచిన పదిహేను సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తగ్గలేదు. పైగా వీటి ధరలు పెరిగాయి. అయితే ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోగల భారత ప్రభుత్వం ఈ మూడు రకాల ఎరువుల ధరలను టన్నుకు గరిష్ఠంగా దాదాపు 4,000 రూపాయల మేర తగ్గించాలని నిర్ణయించింది.’ అన్నారు. ఓ బిజెపి రాష్టస్థ్రాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎపి ధర టన్నుకు 2,000 రూపాయల చొప్పున, ఎమ్‌ఒపి, ఎన్‌పికె ధరలు టన్నుకు 4,000 రూపాయల చొప్పున తగ్గుతాయన్నారు. సోమవారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడచ్చన్నారు. తమ నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.