బిజినెస్

దారికి రాకుంటే టారిఫ్ మోత తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 2: ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని చైనాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దారికి రాకపోతే, టారిఫ్ మోత తప్పదని తేల్చిచెప్పారు. సుమారు 50 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై పన్నును అమెరికా ఇటీవల 25 శాతం పెంచింది. దీనితో తీవ్రంగా స్పందించిన చైనా సుమారు 545 అమెరికా వస్తువులపై 34 బిలియన్ డాలర్ల మేర పన్నును పెంచేసింది. ఈ సంఘటనతో కంగుతిన్న అమెరికా, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే, తాజాగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని ట్రంప్ చైనాకు పిలుపునిచ్చారు. ఒకవేళ దారికి రాకుండా, ఇదే తీరులో వ్యవహరిస్తే, టారిఫ్‌ను మరింత పెంచుతామని అన్నారు. సుమారు 5000 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై పన్నును పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.