బిజినెస్

ఈ పట్టణాలకు ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూలై 11: స్థానిక సంస్థల ద్వారా ప్రజాసామ్యాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేసింది. 24 ఏళ్ల తరువాత కూడా పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదని నీతి ఆయోగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. 1992లో నగరపాలిక చట్టం (74వ సవరణ) చేయగా 1993 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని మున్సిపాల్టీల్లోనే చట్టం అమలు అవుతోందని సింగ్ వెల్లడించారు. నిధులకోసం రాష్ట్రాలపై ఆధారపడడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. 74వ రాజ్యాంగ సవరణ జరిగి పాతికేళ్లయిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ జాతీయ సదస్సులో నీతి ఆయోగ్ డైరక్టర్ కీలక ఉపన్యాసం చేశారు. ‘కట్స్’ అనే అంతర్జాతీయ సంస్థ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్, స్మార్ట్ సిటీ, అందరికీ ఇళ్లు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నీతి ఆయోగ్ డైరెక్టర్ పిలునిచ్చారు. పథకాలను అందిపుచ్చుకుని మున్సిపాల్టీలు అభివృద్ధి సాధించాలని ఆయన అన్నారు. కేంద్ర పథకాలతో పట్టణాలను అభివృద్ధి చేసుకుంటూ మరోపక్క స్థానికంగానే నిధులు సమీకరించుకోవాలని సంజయ్ కుమార్ సింగ్ సూచించారు. అంతేతప్ప నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలని హితవుచెప్పారు. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలన్న మంచి ఉద్దేశంతోనే 74వ రాజ్యాంగ సవరణ జరిగినట్టు ఆయన వెల్లడించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ప్రొఫెసర్ డెబోలినా కండూ మాట్లాడుతూ పట్టణ స్థానిక సంస్థలు నిధులు సమీకరించుకుని స్వయం సమృద్ది సాధించాలని అన్నారు. ఓ ఉద్దేశం కోసం 74వ సవరణ చేశారో అది అమలుకు నోచుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని కట్స్ అంతర్జాతీయ డైరెక్టర్ జార్జి చెరియన్ ఆవేదన వ్యక్తం చేశారు.
74వ రాజ్యాంగ సవరణ ఓ చారిత్రాత్మక ఘట్టమన్న చెరియన్ ‘దానిపై అధ్యయనం చేయగా ముంబయి, పూణే నగరాల్లో తప్ప ఎక్కడా పూర్తిగా అమలుజరుగుతున్నట్టులేదు’ అన్నారు. అప్పగించిన 18 విధుల్లో 14 పూర్తిగా ఒకటి పాక్షింగానే అమలయిందని ఆయన వివరించారు. జైపూర్‌లో ఏడు మాత్రం అమలు జరిగాయన్నారు. లండన్, న్యూయార్క్, కనీసం జొహెనె్నస్‌బర్గ్‌తో పోటీపడే నగరం భారత్‌లో ఒక్కటి కూడా లేకపోవడం దారుణమని ఆయన తెలిపారు.