బిజినెస్

డీసీఐని మూసివేసే సమస్యే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: ప్రభుత్వ రంగ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను మూసివేసే సమస్యే లేదని కేంద్ర షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. విశాఖపట్నం ఓడరేవు సహా మూడు పోర్ట్‌లు డీసీఐలోని ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయడానికి ప్రణాళిక ఉందని ఆయన వివరించారు. ‘డిపార్ట్‌మెంట్ స్థాయిలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మూడు ప్రధాన ఓడరేవులు ఇప్పుడు డీసీఐని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మేము ఇదివరకే క్యాబినెట్ ఆమోదం కోసం క్యాబినెట్ నోట్‌ను సమర్పించాం. పారదీప్ పోర్ట్, న్యూ మంగళూరు పోర్ట్ డీసీఐలోని వాటాలను కొనుగోలు చేస్తాయి. డీసీఐని పునర్వ్యవస్థీకరించే ప్రణాళిక కూడా ఉంది. దానివల్ల అది మరింత బలపడుతుంది’ అని గడ్కరీ తెలిపారు. అందువల్ల డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేయడమనే ప్రశ్నయే ఉదయించదు. ప్రస్తుతం డీసీఐలో ప్రభుత్వం 73 శాతం వాటాలు కలిగి ఉంది. ఈ వాటాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 1,400 కోట్లు సమకూరుతాయి. డీసీఐ ఇప్పుడు కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పాలనా నియంత్రణలో ఉంది.