బిజినెస్

మరో రూ.10 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొద్ది రోజులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), కార్పొరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సుమారు రూ. పది వేల కోట్ల నిధులు సమకూర్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నియంత్రణ సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మూలధన అవసరాలను తీర్చుకునేందుకు కేంద్రం ఈ ఆర్థిక సాయం చేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో కొన్ని అడిషనల్ టైర్ (ఏటీ-1) బాండ్ల హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల విషయంలో ఒత్తిడికి గురవుతున్నాయి. దీని ఫలితంగా అవి మూలధన అవసరాల విషయంలో నిబంధనలను ఉల్లంఘించే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. తీవ్రమయిన మూలధన కొరతను ఎదుర్కొంటున్న నాలుగయిదు బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకులు ఏటీ-1 బాండ్ల ద్వారా మూలధనాన్ని పెంచుకున్నాయి. ఈ బాండ్లకు బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, మొండి బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోవడం, నష్టాలు ఎక్కువ కావడం వల్ల కొన్ని బ్యాంకులు ఈ ఏటీ-1 బాండ్లకు వడ్డీ చెల్లించడం క్లిష్టంగా మారింది. అందువల్ల ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పీఎన్‌బీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ సహా కొన్ని బ్యాంకులకు ఈ వారంలో లేదా వచ్చే వారం మొదట్లో కేంద్ర నిధులు సమకూరుస్తుందని ఆ వర్గాలు వివరించాయి. రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 2.11 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చడానికి ప్రకటించిన ప్యాకేజీలో ఇంకా మిగిలిన రూ. 65వేల కోట్లలో భాగంగా కేంద్రం ఈ నిధులు సమకూరుస్తోంది. తాజా దశలో కేంద్రం సమకూర్చే మూలధనం మొత్తం రూ. 8,000ల నుంచి రూ. 10,000 కోట్ల వరకు ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో రూ. 2.11 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చే కార్యక్రమాన్ని ప్రకటించింది.