బిజినెస్

ఆర్థిక రంగంలో తిరుగులేని భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: భారత్ ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతుందని, చైనాను అధిగమించిందని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబి) ప్రకటించింది. 2018-19లో 7.3 శాతం, 2019-20లో 7.6 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని ఆ బ్యాంకు పేర్కొంది. ప్రజా వ్యయం పెరగడం, వినిమయ రేటు, ప్రైవేట్ పెట్టుబడుల్లో వృద్ధిరేటు వల్ల భారత్ దేదీప్యమానంగా ఆర్థిక రంగంలో వెలుగుతుందని ఏడీబి అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2018లో చైనా ఆర్థికాభివృద్ధిరేటు 6.6 శాతానికి, 2019లో 6.4 శాతానికి క్షీణిస్తుంది. చైనా వృద్ధిరేటు 2017లో 6.9 శాతం నమోదైంది. కాగా భారత్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వృద్ధిరేటు 7.3శాతం రేటును నిలబెట్టుకుంటుందన్నారు. వస్తుసేవా పన్ను వల్ల వృద్ధిరేటు బాగా నమోదవుతోంది. కాగా చమురు ధరలు మాత్రం ఈ వృద్ధిరేటును దెబ్బకొట్టే అవకాశం ఉందని ఏడీబి తెలిపింది. దక్షిణాసియా దేశంలో భారత్ పరుగులుపెడుతోంది. గత ఏడాది చివరి త్రైమాసిక కాలంలో భారత్ 7.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఆసియాప్రాంతంలోని దేశాల జీడీపీ 2018లో ఆరు శాతం, 2019లో 5.9 శాతం ఉంటుందని ఈ ఏడీబీ పేర్కొంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, ఐరోపా యూనియన్‌ల వృద్ధిరేటు బలంగానే ఉంటుంది. జపాన్‌లో కొన్ని వ్యత్యాసాల వల్ల వృద్ధిరేటు 2018లో మందగిస్తుందని పేర్కొంది. దక్షిణాసియాదేశాల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. 4.7 శాతం నుంచి ఐదు శాతానికి ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఏడీబీ పేర్కొంది. భారత్‌లో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 4.7 శాతంనుంచి 5.1 శాతానికి పెరుగుతుందని, చమురు ధరల ప్రభావం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతుందని ఏడీబీ తెలిపింది.