బిజినెస్

సామ్‌సంగ్ భారీ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం దేశీయ మార్కెట్‌కు ఏకంగా 44 సరికొత్త స్మార్ట్ టీవీ మోడళ్లను పరిచయం చేసింది. గరిష్ఠ ధర 24 లక్షల రూపాయలు. నిరుడు 82 లక్షల టెలివిజన్లను విక్రయించి భారతీయ టీవీ మార్కెట్‌లో 31 శాతం వాటాను దక్కించుకున్న సామ్‌సంగ్ ఇండియా.. ఈ ఏడాది 35 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే మార్కెట్‌లోకి ఇంత భారీ ఎత్తున నూతన మోడల్ టీవీలను విడుదల చేసినట్లు సామ్‌సంగ్ ఇండియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యక్షుడు రాజీవ్ భుటాని ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఇకపోతే తాజాగా విడుదలైన మోడళ్లలో తొమ్మిది ఎస్‌యుహెచ్‌డి శ్రేణివి అవగా, మరో ఏడు జాయ్ బీట్ శ్రేణికి చెందినవి. మిగతావన్నీ కూడా స్మార్ట్ టీవీ శ్రేణిలోనివే. ఎస్‌యుహెచ్‌డి శ్రేణిలో టీవీలు 49 అంగుళాల నుంచి 88 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. వీటి ధర 1.79 లక్షల రూపాయల నుంచి 23.99 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. జాయ్ బీట్ టెలివిజన్లు 32 అంగుళాల నుంచి 49 అంగుళాల స్క్రీన్‌తో ఉంటాయి. వీటి ధర 27,500 రూపాయల నుంచి 69,500 రూపాయల మధ్య ఉంటుంది. ఇక స్మార్ట్ టీవీ రకాలు 28 ఉండగా, 32 అంగుళాల నుంచి 88 అంగుళాల స్క్రీన్‌తో లభించే వీటి ధర 34,500 రూపాయల నుంచి 7.04 లక్షల రూపాయల మధ్య ఉంది. కాగా, అమ్మకాలపరం గా ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి- జూన్)లో గతంతో పోల్చితే 12-15 శాతం వృద్ధిని అందుకున్నామని భుటాని చెప్పారు. మొత్తం అమ్మకాల్లో 60-65 శాతం పట్టణాలు, నగరాలదేనన్నారు. మిగతాది గ్రామీ ణ ప్రాంతాల నుంచి నమోదైందన్నారు.

చిత్రం.. మంగళవారం న్యూఢిల్లీలో సరికొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సామ్‌సంగ్ ప్రతినిధులు