బిజినెస్

అమెరికాతో చైనా ప్రచ్ఛన్న యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్పెన్ (యూఎస్), జూలై 21: అమెరికాతో చైనా వాణిజ్యపరమైన ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతున్నది. అమెరికాను నెట్టేసి, ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకే, యూఎస్‌తో వాణిజ్యపరమైన పోరాటానికి తెరతీసింది. ఈ విషయాలను అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తన నివేదికలో వెల్లడించింది. యుద్ధానికి చైనా సిద్ధంగా లేదని, అయితే, జీ జింగ్‌పింగ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అక్కడి కమ్యూనిస్టు పార్టీ అమెరికా వ్యతిరేక విధానాలను మాత్రం తప్పనిసరిగా అవలంభిస్తుందని సీఐఏ తన నివేదికలో స్పష్టం చేసింది. ఒకప్పుడు రష్యా రాజకీయ కోణంలోనే ఆధిపత్యాన్ని కనబరచేందుకు ప్రయత్నించడంతో అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం ఉండేదని, ఇప్పుడు చైనా వాణిజ్య కోణంలో ముందడుగు వేస్తున్నదని సీఐఏ తూర్పు ఆసియా మిషన్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ మైఖేల్ కొలిన్స్ ఆ నివేదికలో పేర్కొన్నాడు. అమెరికా, చైనా మధ్య చర్య, ప్రతీకార చర్యలు పెరుగుతున్నాయని తెలిపాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని చైనా విపరీతంగా పెంచిన విషయాన్ని అతను ఈ సందర్భంగా గుర్తుచేశాడు.