బిజినెస్

ఉపాధి పనుల్లో అక్రమాలు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే సహించబోమని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. జూపల్లి అధ్యక్షతన శనివారం ఇక్కడ జాతీయ ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కామారెడ్డి, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఉపాధిహామీ పనుల్లో అక్రమాలు జరిగాయని ఆ యా జిల్లాల సభ్యులు ప్రస్తావించగా, మంత్రి తీవ్రంగా స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించాలన్నదే జాతీయ ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకోసం ఉద్దేశించిన ఈ పథకంలో అక్రమాలకు పాల్పడటం మంచిది కాదన్నారు. రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉపాధిహామీ పనులపై విచారణ చేసి వారంరోజుల్లో తనకు నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ పథకం సజావుగా జరుగుతోందని, అయితే పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉపాధి హామీ పథకంలో భాగస్వాములు కావాలని, కౌన్సిల్ సభ్యులు ఈ అంశంలో చొరవ తీసుకోవాలని కోరారు. జాబ్ కార్డులు ఉన్న కూలీల్లో కనీసం 60 శాతం మందికైనా వందరోజుల పాటు పనికల్పించాలని సూచించారు. హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పెద్దఎత్తున చేపడితే ఉపాధిహామీ పథకం విజయవంతం అవుతుందన్నారు. కొన్ని గ్రామాల్లో 90 శాతం మందికి పని కల్పిస్తే, మరికొన్ని గ్రామాల్లో చాలా తక్కువ మందికి పని లభిస్తోందన్నారు. అక్టోబర్ 2 నాటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి, స్వచ్ఛతెలంగాణ సాధించాలని కోరారు. జిల్లాస్థాయి సమావేశాలకు ఆ యా జిల్లాల్లో ఉండే రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులను ఆహ్వానించాలని మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు మంత్రికి వినతిపత్రం అందచేస్తూ, తమకు గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై పరిశీలిస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.