బిజినెస్

డీలర్ల వద్దే వాహన రిజిస్ట్రేషన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: కొత్త వాహనాల కొనుగోలుదారులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతోంది. తాము వాహనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునేలా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానం అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే హైదరాబాద్ నగరంలో ఈ విధానం ఇప్పటికే అమలవుతుండగా దీన్ని రాష్టవ్య్రాప్తంగా విస్తరింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధానం ఆంధ్రప్రదేశ్‌లో రాష్టమ్రంతా అమలు జరుగుతోంది. వ్యక్తిగత వాహనాలను మాత్రమే డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు, వాహనాల నెంబర్లు డీలర్లే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులపై పనిభారం తగ్గించేందుకు, అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం
ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నప్పటికీ ఇంకా మెరుగ్గా అందించటమే ప్రభుత్వ లక్ష్యమని అంటున్నారు. ఇందుకు సంబంధించి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వ్యక్తిగతంగా వినియోగించే వాహనాలకు మాత్రమే ఈ ప్రక్రియను అమలు చేయాలని, ట్యాక్సీ ప్లేటుతో ఉండేవాటికి ఇప్పుడున్న విధానమే కొనసాగించాలని నిర్ణయించారు. రవాణా వాహనాలకు బీమా, ఆరు నెలలకు ఒకసారి ట్యాక్స్, సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ టెస్టు, తదితర అంశాలు పరిశీలించాల్సిన నేపథ్యంలో యథావిధిగానే ఈ ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ చార్జీ పేరుతో వాహన డీలర్లు రూ. 2వేలకు పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చిపెట్టే ఫ్యాన్సీ నెంబర్ల జారీ ప్రక్రియను రవాణా శాఖ ఆధీనంలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది. డీలర్లు విడుదల చేసే ప్రతి వాహనం వివరాలను పూర్తిగా ఆన్‌లైన్ చేయడంతో పాటు నగదు చెల్లింపులు కూడా ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించడం ద్వారా వారి దందాను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.