బిజినెస్

నల్లధనం వివరాలు వెల్లడించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: దేశంతోపాటు విదేశాల్లో భారతీయులు దాచి ఉంచిన నల్లధనానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వివరాలను బహిర్గతం చేయడం పార్లమెంటు హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దాఖలనైన ఒక పిటిషన్‌కు సమాధానమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2011లో, అప్పటి యూపీఏ సర్కారు నల్లధనం వివరాలను తెలుసుకొని, సమగ్ర సమాచారాన్ని అందించే మాధ్యతను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలిసీ (ఎన్‌ఐపీఎప్‌పీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్పిలైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎం) సంస్థలకు అప్పగించింది. ఈ మూడు సంస్థలు వరుసగా 2013 డిసెంబర్ 30, 2014 జూలై 18, 2014 ఆగస్టు 21 తేదీల్లో నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ నివేదికలను పార్లమెంటు ఆర్థిక స్టాండింగ్ కమిటీ పరిశీలించి, తుది నివేదికను గత ఏడాది జూలై 21న ప్రభుత్వానికి అందించింది. కాగా, ఈ మూడు సంస్థలు ఇచ్చిన నివేదికలోని అంశాలతోపాటు, స్టాండింగ్ కమిటీ చేసిన ప్రతిపాదనలను వెల్లడించాలని పీటీఐ విలేఖరి ఆర్‌టీఐ కింద పిటిషన్ వేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రత్వ శాఖ స్పందిస్తూ, అదే చట్టంలోని 8 (1) (సీ) కింద వివరాలను వెల్లడించలేమని ప్రకటించింది. ఈ విషయంలో సమాచారాన్ని అందిస్తే, అది పార్లమెంటు హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరించింది. నల్లధనంపై ప్రస్తుతానికి అధికారిక సమాచారంగానీ, వివరాలుగానీ ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఇలావుంటే, 2005-2014 మధ్యకాలంలో భారత్‌లోకి సుమారు 770 బిలియన్ డాలర్ల నల్లధనం భారత్‌లోకి ప్రవేశించిందని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్‌ఐ) ఒక నివేదికలో పేర్కొంది. అదే కాలంలో, దేశం నుంచి 165 మిలియన్ డాలర్ల విలువగల ద్రవ్యం అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలి వెళ్లిందని తెలిపింది. నల్లధనంపై ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొందని, మీడియా కూడా ఇదే విషయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని 2011లో విచారణకు ఆదేశించిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. నల్లధనం విలువను మదింపు చేసి, దానిని వెలికి తీయడానికి లేదా విదేశాల నుంచి తిరిగి రాబట్టడానికి మార్గాలను అనే్వషించాల్సిన అవసరం ఉందని తెలిపింది. నివేదికలు చేతికి అందిన తర్వాత కూడావాటి వివరాలను వెల్లడించడం సాధ్యం కాదని ఆర్‌టీఐ పిటిషన్‌కు సమాధానంగా చెప్పింది.