బిజినెస్

నాన్‌బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 23: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ కుంభకోణంలో నిందితుడైన గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మెహుల్ ఛోక్సీ తనపై జారీ చేసిన రెండు నాన్‌బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయాలని కోరుతూ హవాలా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టును ఆశ్రయించాడు. భారత్‌కు వస్తే తనపై మూక దాడులు జరిగే అవకాశం ఉందని, జైల్లోనూ భద్రత ఉండదని, తన ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని చోక్సీ తన పిటిషన్‌లో అనుమానాలు వ్యక్తం చేశాడు. పీఎంఎల్‌ఏతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) కూడా పీఎన్‌బీ కుంభకోణం నేపథ్యంలో చోక్సీకి నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. అయితే, తాను విచారణ నుంచి దూరంగా పారిపోవడం లేదని, తనకు పంపిన ప్రతి ప్రశ్నకూ సమాధానమిస్తున్నానని చోక్సీ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. భారత్‌కు వస్తే తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. గతంలో తన సంస్థలో పని చేసిన ఉద్యోగులతోపాటు, సాధారణ ప్రజలు కూడా తనపై దాడి చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. అంతేగాక, ఒక వేళ జైల్లో పెడితే, అక్కడ తోటి ఖైదీలు దాడులకు దిగుతారని అనుమానం వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో భారత్‌లో మూక దాడుల సంఘటలు పెరుగుతున్నాయని తెలిపాడు. ఈ పరిస్థితుల్లో తాను భారత్‌కు వస్తే, దానపైన కూడా తీవ్ర స్థాయిలో దాడులు జరగవచ్చని తెలిపాడు. దాడుల ప్రమాదం, ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని, తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయాలని కోరాడు. కాగా, చోక్సీ అభ్యర్థనపై సమాధానం ఇవ్వాలని ఈడీని ఆదేశించిన పిఎంఎల్‌ఏ న్యాయమూర్తి ఎంఎస్ ఆజ్మీ ఈ కేసును ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేశారు. దేశంలో సంచలనం సృష్టించిన పీఎన్‌బీ కోట్లాది రూపాయల కుంభకోణంలో నీరవ్ మోదీతోపాటు అతని సమీప బంధువైన చోక్సీ కూడా నిందితుడే. వీరిద్దరూ విదేశాలకు పారిపోవడంతో కేసు నత్తనడకన సాగుతున్నది. సుమారు 13,400 కోట్ల రూపాయలను పీఎన్‌బీకి ఎగవేసినట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. 2011లో ఈ కుంభకోణం మొదలుకాగా, ఈ ఏడాది జనవరిలో వెలుగు చూసింది. బ్యాంక్ అధికారుల అండదండలతోనే ఈ నీరవ్ మోదీ, చోక్సీ కలిసి బ్యాంక్‌ను దారుణంగా ముంచేశారని ఈ కేసుపై విచారణ జరుపుతున్న అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, విదేశాల్లో తలదాచుకున్న వీరిద్దరూ భారత్‌కు రాకుండా, వారెంట్లను సైతం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజా పిటిషన్‌పై ఈడీ ఇచ్చే సమాధానం, పిఎంఎల్‌ఏ కోర్టు తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.