బిజినెస్

రికార్డు స్థాయికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 23: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ సెనె్సక్స్ సోమవారం రికార్డు స్థాయికి చేరింది. నిఫ్టీలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది. పలు వస్తుసేవలపై జీఎన్‌టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. 30-షేర్ ఇండెక్స్ 222.23 పాయింట్లు (0.61 శాతం) పెరిగి, 36,718.60 రూపాయల వద్ద స్థిరపడింది. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య, కరెన్సీ యుద్ధంపై ఆసియా మార్కెట్‌లో భయాందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ భారత్‌లో మాత్రం దాని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. జీఎస్‌టీ నుంచి కొన్ని వస్తుసేవలను మినహాయించడం వల్లే సెనె్సక్స్ పుంజుకుందని నిపుణులు, విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. 36,501.05 వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ క్రమంగా పుంజుకొని 36,501.05కు చేరింది. ఐటీసీ, హిందుస్థాన్ యూనీలెవర్, ఏషియన్ పెయింట్స్ షేర్ల ఇన్‌ట్రా ట్రేడింగ్ జోరుగా కొనసాగింది. వేదాంత లిమిటెడ్, అదానీ పోర్ట్స్, భారతి ఎయిర్ టెల్, మారుతి సుజికీ షేర్లు లాభపడ్డాయి. ఈనెల 12న 26,548.41తో ముగిసిన సస్సెక్స్ సోమవారం ఆ రికార్డును అధిగమించడం విశేషం.