బిజినెస్

బీఎస్-6 ప్రమాణాలు పాటించని వాహనాల తయారీ బంద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో బీఎస్-6 ప్రమాణాలు పాటించని వాహనాల అమ్మకాలు, తయారీని 2020 ఏప్రిల్ ఒకటి నుంచి నిలిపివేస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఢిల్లీలో ఏర్పడుతున్న కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) వేసిన పిటిషన్‌ను ఎంబి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై కేంద్రం వివరణ ఇస్తూ డీజిల్ వాహనాల వాడకం వల్లే కాలుష్యం రోజురోజుకు అధికమవుతోందని తెలియజేసింది. అయితే డీజిల్ కాని, ఇతర ఇంధన ధరలను కాని నియంత్రించడం తమకు సాధ్యం కాదని అఫిడవిట్‌లో పేర్కొంది. కేంద్రం తరఫున వాదిస్తున్న అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎఎన్‌ఎస్ నాదకర్ణి మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించే బీఎస్-6 ఇంధనం తయారీ నిమిత్తం కేంద్రం 28 వేల కోట్లను పెడుతోందని చెప్పారు. ఒకవేళ బీఎస్-6 ప్రమాణాలు పాటించని వాహనాల అమ్మకాలు, తయారీ కొనసాగినట్టయితే ఈ ఇంధనాన్ని వాడాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, 2020 నుంచి బీఎస్-6 ప్రమాణాలు పాటించని వాహనాలను అంగీకరించని పక్షంలో బీఎస్-6 ఇంధనాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పెట్రోల్, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజురోజుకు ప్రమాదకరంగా పెరిగిపోతున్న కాలుష్యానికి డీజిల్ వాహనాలే కారణమని ఎన్విరాన్‌మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ పేర్కొన్నందున డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి ఫోర్‌వీలర్లకు, ప్రైవేట్ వాహనాలకు వాడే డీజిల్ ధరను పెట్రోల్ ధరతో సమానంగా చేయడం సాధ్యమేనా అని కోర్టు జూలై 13న ప్రశ్నించింది. దీనిపై వాహనతయారీదారులు ఇతరులు వివరణ ఇస్తూ బీఎస్-6 ఇంధనం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అందుబాటులో ఉంటుందని, ఈ సమస్యకు బీఎస్-6 ఇంధనం వాడకమొక్కటే పరిష్కారమని పేర్కొంది. ఈ ఇంధనం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 23 జిల్లాలకు అందుబాటులో ఉంటుందని, ఈ మేరకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలియజేసింది. అలాగే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల మధ్య ఉన్న ధరల అంతరాయాన్ని తగ్గించడం సాధ్యం కాదని, ఆర్థికపరంగా ఇది కుదరదని, ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని విన్నవించింది.