బిజినెస్

ఐటీ వసూళ్ల లక్ష్యం రూ.60,845 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: రెండు తెలుగు రాష్ట్రాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ 60,845 కోట్లు ఆదాయపన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్యామ ప్రసాద్ చౌదరి వెల్లడించారు. సోమవారం ఉదయం ఆయన ఐటీ టవర్స్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పన్ను పరిధిలోకి కొత్తగా 10.13 లక్షల మంది చేరారని ఆయన చెప్పారు. ఐటీ శాఖ కమిషనర్ (అడ్మిన్) డాక్టర్ రాజేంద్ర కుమార్, ప్రిన్సిపల్ కమిషనర్ కే శ్రీ్ధర్‌లతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. జూలై 31లోగా నిర్దేశించిన వ్యక్తులు , సంస్థలు తమ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని, పన్ను చెల్లింపు నిర్ణీత సమయంలో జరగని పక్షంలో కఠిన శిక్షలు
ఉన్నాయని, వాటిని ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. అన్ని సంస్థలూ, వ్యక్తులూ తమ చెల్లింపులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో కోటి వరకూ ప్యాన్ కార్డులు ఉండగా, 36 లక్షల మంది టాక్స్ రిటర్న్‌లను దాఖలు చేస్తున్నారని, రెండు రాష్ట్రాల్లో పన్ను వసూలులో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని చౌదరి చెప్పారు. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 49,775 కోట్లు ఆదాయపన్నుగా వసూలైందని అన్నారు. 2017-18లో కొత్తగా 8 లక్షల 13వేల 759 మంది రిటర్న్‌లను దాఖలు చేశారని వివరించారు. దేశవ్యాప్తంగా ఆదాయపన్ను రూ. 10 లక్షల మూడువేల కోట్లు వసూలు అయిందని గుర్తుచేశారు. జూలై తర్వాత పన్ను రిటర్న్‌లను సమర్పిస్తే వారంతా ఐదు వేలు జరిమానా చెల్లించాలని, డిసెంబర్ తర్వాత పన్ను రిటర్న్‌లను సమర్పిస్తే పదివేలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని, మార్చి తర్వాత వారిని ప్రాసిక్యూట్ చేస్తామని పేర్కొన్నారు. పన్ను చెల్లింపులో ఉత్పత్తి రంగం అగ్రస్థానంలో ఉందని, తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్, ఫార్మా, వినోదరంగాలు ఉన్నాయని చెప్పారు. ఒక ఉద్యోగి తన వేతనం 30కోట్లు వరకూ ఉందని పన్ను రిటర్న్‌లను సమర్పించారని, ఆమె అత్యధిక పన్ను చెల్లింపు ఉద్యోగిగా గుర్తించామని అన్నారు. ఎన్‌ఎండీసీ, ఎపి గ్రామీణ బ్యాంకు కూడా గరిష్ట పన్ను చెల్లింపు సంస్థలుగా గుర్తించామని వివరించారు. సకాలంలో టీడీఎస్ చెల్లించకపోవడం నేరంగా పరిగణిస్తామని, న్యాయస్థానాల ద్వారా మినహాయింపు పొందిన సందర్భాల్లో తప్ప, ఎవరికీ చెల్లింపు గడువు మినహాయింపు ఉండదని ఆయన పేర్కొన్నారు. 83 ఆస్తులను గుర్తించి వాటిని బినామీ ఆస్తుల చట్టం కింద స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నల్లధనం నిరోధక చట్టం కింద జూన్ చివరి వరకూ 108 కేసులు నమోదు చేశామని, 2017-18లో 38 దాడులు నిర్వహించి 40.95 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, ఈ ఆర్ధిక సంవత్సరంలో 11 దాడులు నిర్వహించి 14.28 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆదాయాన్ని వెల్లడించని వారి నుండి 1166.97 కోట్లు వసూలు చేశామని, ఈ ఏడాది ఇంత వరకూ 285.70 కోట్లు వసూలు చేశామని పేర్కొన్నారు. అదనపు ఆదాయం గుర్తించి 415 మంది ఆస్తులను పరిశీలించి, ముగ్గురి నుండి 589.41 కోట్లు వసూలుచేశామని, ఏడుగురికి అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని చెప్పారు.
నేడు ఇన్‌కంటాక్స్ డే
దేశంలో ఇన్‌కంటాక్స్ 1860 జూలై 24 నుండి అమలులోకి వచ్చిందని, మంగళవారం నాడు 158వ ఉత్సవాన్ని జూబ్లీ హిల్స్ జెఆర్‌జె కనె్వన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్నామని చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. ఆయనతో పాటు ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్ బైజేంద్ర కుమార్, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ చైర్మన్ కే సతీష్ రెడ్డి, అమర్‌రాజా బ్యాటరీస్ చైర్మన్ రామచంద్ర ఎన్ గల్లా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సీఎండీ వి ఉదయ్ భాస్కర్ హాజరవుతారని వివరించారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్