బిజినెస్

జీఎస్టీ రేట్ల తగ్గింపుపై పునఃసమీక్షకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర ప్రభుత్వం ఇటీవల రిఫ్రజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, శానిటరీ నాప్‌కిన్స్ వంటి 88 వినియోగ వస్తువులపై తగ్గించిన జీఎస్టీ రేట్లపై తిరిగి సమీక్షించేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. అఖిల భారత వర్తకుల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ జరిగిన అఖిల భారత వర్తకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలతో ముందుకు సాగుతోందని అన్నారు. గత నాలుగేళ్లుగా ఆర్థిక సంస్కరణల అమలులో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. దేశంలో కొద్దిరోజుల కిందట వినియోగదారులు ఉపయోగించే ఎన్నోరకాల వస్తువులపై జీఎస్టీ రేట్లను కొన్నింట్లో సున్నా శాతం, మరికొన్నింట్లో ఐదు శాతం శ్లాబులను తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కేంద్రం తాజాగా తీసుకున్న ఆయా వస్తువులకు జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయించిన శ్లాబు రేట్లపై పున:సమీక్షించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని 6.5 కోట్ల మంది వ్యాపారులు, 1.25 కోట్ల మంది దుకాణదారులు కొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ కింద పన్ను మినహాయింపు కోసం పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ ఒక ప్రధాన అంశంగా నిలవడంతో దేశంలోని 130 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 6.10 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్