బిజినెస్

ఇంటర్‌నెట్‌పై వాయిస్ సేవలకు బీఎస్‌ఎన్‌ఎల్ శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 23: వర్తమాన టెలికాం మార్కెట్‌లో నెలకొని ఉన్న తీవ్ర పోటీని దృష్టిలో ఉంచుకుని సంవత్సరానికి రూ. 1099కే ‘ఇంటర్‌నెట్ పై వాయిస్’ సేవలను అందించే ఒక నూతన సేవను బీఎస్‌ఎన్‌ఎల్ ఆవిష్కరించింది. బీఎస్‌ఎన్‌ఎల్ వింగ్స్ అనే బ్రాండ్‌తో ఈ- టెలికాం సేవలను ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ రావు సోమవారం నాడిక్కడ ఆవిష్కరించారు. ఏ నెట్‌వర్క్‌కైనా, ల్యాండ్ లైన్, మొబైల్ నెంబర్‌లకు సిమ్ కార్డు అవసరం లేకుండా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవడమే ఈ సేవ ప్రత్యేకత. గూగుల్‌లో ‘గ్రాండ్ స్ట్రీమ్ వేవ్’ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఈ సేవలను వినియోగించుకోవచ్చన్నారు. బ్రాడ్ బ్యాండ్‌లో కూడా కేవలం నెలకు రూ. 99లకే 45 జీబీ డాటాతో పాటుగా దేశ వ్యాప్తంగా అపరిమిత ఉచిత కాల్స్ ఉన్న ఆకర్షణీయమైన ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ అందుబాటులోనికి తీసుకువచ్చిందన్నారు. ‘నెక్ట్స్ జనరేషన్ నెట్ -వర్క్’ అనే అధునాతన సాంకేతికతతో, ఆడియో కాన్‌ఫరెన్సింగ్, వీడియో కాన్‌ఫరెన్సింగ్, సీయుజీ సదుపాయాలను చౌక ధరలకే అందిస్తుంది. ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్ సేవల్లో కూడా డిమాండ్ పెరుగుతున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో 20వేల ల్యాండ్ లైన్‌లు, 17వేల బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు అమర్చామన్నారు. దీంతో 23 శాతం వృద్ధి నమోదైందన్నారు. ఈ ఏడాది 88వేల కనెక్షన్‌లు ఫైబర్‌పై ఇంటర్‌నెట్ ఇచ్చే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. మొబైల్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలందించటంలో భాగంగా నూతన టెక్నాలజీతో కూడిన బీటీఎస్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో పీజీఎం (మొబైల్) జాన్ క్రిస్సోటమ్, పీజీఎం (పిక్స్ లైన్) ఎల్‌ఎస్ రోపియా, జీఎం ఏవీ రావు, జీఎం (మొబైల్ ప్లానింగ్) రవికుమార్ బంగా ఇతర అధికారులు పాల్గొన్నారు.