బిజినెస్

కీలక వడ్డీ రేట్లు యథాతథం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 24: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆగస్టులో జరిపే తన ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థిక పరిశోధనా విభాగం మంగళవారం అంచనా వేసింది. అయితే మెజారిటీ విశే్లషణా సంస్థలు వేసిన అంచనాకు ఇది భిన్నంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగినందున ఆర్‌బీఐ ఆగస్టులో మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచుతుందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా సహా పలు సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. ‘ఆగస్టులో జరిపే ద్రవ్య విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచడం కన్నా యథాతథంగా కొనసాగించడంవైపే మొగ్గు చూపుతుందని మేము విశ్వసిస్తున్నాం’ అని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు ఒక నోట్‌లో పేర్కొన్నారు. జూన్ నెలలో ద్రవ్యోల్బణం అయిదు శాతానికి పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణం ప్రమాదాలు ఇంకా సమతుల్యంగానే ఉన్నాయని ఆ నోట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ)ను పెంచడం వల్ల కేవలం వినియోగ వస్తువుల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మాత్రమే 0.73 శాతం వరకు పెరుగుతుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు పెరిగినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పెద్దగా ఉండబోదని వారు పేర్కొన్నారు.