బిజినెస్

పర్యావరణానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: దేశంలోని కార్ల తయారీ కంపెనీలలో అతి పెద్దదయిన మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) బీఎస్ 6 ఉద్గారాలకు సంబంధించి మార్గదర్శకాలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతోందని ఆ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం తెలిపారు. బీఎస్ 6 ఉద్గారాల మార్గదర్శకాలు 2020 ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి. ఎంఎస్‌ఐ మంగళవారం తన నెక్సా కస్టమర్ల కోసం టెలిమాటిక్స్ సొల్యూషన్ ‘సుజుకి కనెక్ట్’ను ప్రారంభించింది.
కొత్త ఉద్గార నియమాలను పాటించే విధంగా తమ అన్ని రకాల మోడళ్ల వాహనాలను మార్చడానికి తమ ఇంజనీర్లు 24 గంటల పాటు పనిచేస్తున్నారని మారుతి సుజుకి ఇండియా పేర్కొంది. అలాగే కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా మారుస్తున్న తమ వాహనాల మోడళ్లు వచ్చే సంవత్సరం నుంచి మార్కెట్‌లోకి వస్తాయని ఆ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) సీవీ రామన్ ఒక వార్తాసంస్థకు చెప్పారు.
అమలులోకి రానున్న కొత్త భద్రతా నియమాలపై తమ కంపెనీ వ్యూహం గురించి రామన్ వివరిస్తూ, ఇప్పటికే తమ సంస్థ తొమ్మిది మోడళ్లను కొత్త భద్రతా నియమాలకు అనుగుణంగా మార్చినట్టు వెల్లడించారు. ‘మేము అదే పనిలో ఉన్నాం. గడువులోగా అన్ని మోడళ్లను కొత్త నియమాలకు అనుగుణంగా మారుస్తాం’ అని రామన్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న మోడళ్లకు కొత్త భద్రతా నియమాలు 2019 అక్టోబర్ నుంచి అమలులోకి వస్తాయి.