బిజినెస్

మార్కెట్ల సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 24: దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు మంగళవారం సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. మదుపరులు ఇంజనీరింగ్, క్యాపిటల్ గూడ్స్, లోహ, స్థిరాస్తి రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరపడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ రెండూ కూడా సరికొత్త ముగింపు రికార్డులు సృష్టించాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం 106.50 పాయింట్లు పుంజుకొని, వరుసగా రెండో రోజు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 36,825.10 పాయింట్ల వద్ద ముగిసింది. లార్సన్ అండ్ టబ్రో (ఎల్‌అండ్‌టీ), ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల విలువ బాగా పెరిగింది. ఈ సూచీ ఒక దశలో 36,902.06 పాయింట్లకు చేరడం ద్వారా మరో ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి రికార్డును సృష్టించింది. సోమవారం నాటి ఇంట్రా-డే హై 36,749.69 పాయింట్లను మంగళవారం అధిగమించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా మంగళవారం 49.55 పాయింట్లు (0.45 శాతం) పుంజుకొని సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 11,134.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీలో 50 సంస్థలకు గాను 32 సంస్థలు లాభపడ్డాయి. జనవరి 29నాటి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి రికార్డును ఈ సూచీ మంగళవారం అధిగమించింది. జనవరి 29న ఇది 11,130.40 పాయింట్ల వద్ద ముగిసింది.
సెనె్సక్స్ ప్యాక్‌లోని ఎల్‌అండ్‌టీ అత్యధికంగా 3.36 శాతం లాభపడింది. ఆసియన్ పెయింట్స్, వేదాంత లిమిటెడ్, అదాని పోర్ట్స్, ఇన్ఫోసిస్ 2.3 శాతం వరకు లాభపడటం ద్వారా కీలక సూచీ సరికొత్త ముగింపు రికార్డు సృష్టించడానికి దోహదపడ్డాయి. లాభపడిన ఇతర సంస్థలలో టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.91 శాతం వరకు పెరిగింది.
మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్ షేర్ల విలువ పడిపోయింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని హీరో మోటోకార్ప్ అత్యధికంగా 1.97 శాతం నష్టపోయింది. నష్టపోయిన ఇతర సంస్థలలో బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, విప్రో, రిల్, యెస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, భారతి ఎయిర్‌టెల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి.