బిజినెస్

ర్వాండా అభివృద్ధికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిగలి: వేగంగా అభివృద్ధి చెందుతున్న తూర్పు ఆఫ్రికా దేశమయిన ర్వాండాతో వ్యాపార సంబంధాలను పెంపొందించుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ర్వాండా అభివృద్ధికి సహకరించడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆఫ్రికా పర్యటనలో ఉన్న మోదీ మంగళవారం ఇక్కడ జరిగిన ఒక వాణిజ్య కార్యక్రమంలో భారత్, ర్వాండాలకు చెందిన ప్రధాన కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓల)ను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ అనేది మా విధానం. భారత్ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం కింద ర్వాండాతో కలిసిపనిచేయగలం. ర్వాండా ప్రజలతో మమేకం కాగలం. మేము అభివృద్ధి చెందాలి. అలాగే మాతో కలిసి అభివృద్ధి చెందాలని కోరుకునే వారందరి అభివృద్ధికి సహకరించాలి’ అని ర్వాండాను సందర్శించిన తొలి భారత ప్రధాని అయిన మోదీ అన్నారు. ‘నాతో పాటు ర్వాండాకు వచ్చిన భారత వాణిజ్య బృందానికి నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. మీరు ఈ రోజు ఒక ర్వాండాకు మాత్రమే రాలేదు. మీరు ర్వాండాకు వచ్చారంటే ఆఫ్రికాలో ఇది కీలక దేశం అయినందున మొత్తం ఆఫ్రికాలోకి వెళ్లడానికి ద్వారాలు తెరుచుకున్నాయని అర్థం’ అని మోదీ అన్నారు. అధ్యక్షుడు పౌల్ కగామే నేతృత్వంలో ర్వాండా పురోగమిస్తోందని ఆయన పేర్కొన్నారు. ర్వాండా నమూనా, అభివృద్ధి, పాలనపై ఆఫ్రికాలో చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. ‘ర్వాండాకు వచ్చారంటే అర్థం ఇక్కడితోనే ఆగిపోరు. ఇక్కడి నుంచి మరిన్ని సాధ్యాలను, సవాళ్లను, అవకాశాలను మీరు చూస్తారు. మీరు ఈ అవకాశాలను వదలి వెళ్లిపోరని నేను విశ్వసిస్తున్నాను’ అని మోదీ అన్నారు.
ఇదిలా ఉండగా, ‘ఆర్థిక సంబంధాల ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యం పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ర్వాండా అధ్యక్షుడు పౌల్ కగామే ఇక్కడ నిర్వహించిన ఇండియా ర్వాండా బిజినెస్ ఫోరంలో ఇరు దేశాలకు చెందిన వాణిజ్యవేత్తలతో భేటీ అయ్యారు. ర్వాండా అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.