బిజినెస్

వ్యాపార ఆశావాదం అంతంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: భారత్‌లో వ్యాపార ఆశావాదం (బిజినెస్ ఆప్టిమిజం)లో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ పెద్దగా మార్పు లేదు. గ్లోబల్ ఆప్టిమిజం ఇండెక్స్‌లో భారత్ గతంలోలాగానే ఆరో ర్యాంక్‌లో కొనసాగుతోందని ఒక సర్వే వెల్లడించింది. ప్రపంచం మొత్తం మీద చూసినప్పటికీ వ్యాపార ఆశావాదం ఇదే రీతిలో ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు గరిష్ఠ స్థాయి ‘నెట్’ 61 శాతంగా ఉన్న వ్యాపార ఆశావాదం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 54 శాతానికి పడిపోయిందని మూడు నెలలకోసారి నిర్వహించే గ్లోబల్ బిజినెస్ సర్వే థోర్న్‌టన్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ (ఐబీఆర్) తెలిపింది. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం భారత్ ఇటీవల ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో అతి పెద్ద ఆరో వ్యవస్థగా అవతరించింది. అయితే, రెండు పెద్ద బలహీనతలు- రూపాయి విలువ పడిపోతుండటం, ముడి చమురు ధరలు పెరుగుతూ ద్రవ్యోల్బణం పెరుగుతుండటం వల్ల భారత్‌లో వ్యాపార ఆశావాదం పుంజుకోవడంలో మందకొడితనం కొనసాగుతోందని బుధవారం వెలువడిన ఆ సర్వే పేర్కొంది. ‘గ్లోబల్ ఆప్టిమిజమ్ ఇండెక్స్‌లో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో 2018 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్థిక పరిస్థితిపై 75 శాతం వ్యాపార సంస్థలు ఆశావాదంతో ఉన్నాయి’ అని గ్రాంట్ థోర్న్‌టన్స్ నివేదిక వెల్లడించింది. గ్లోబల్ ఆప్టిమిజం ఇండెక్స్‌లో ఇండోనేసియా అగ్ర స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో వరుసగా నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్, మెయిన్‌ల్యాండ్ చైనా ఉన్నాయి. భారత వ్యాపార సంస్థల విశ్వాసం 2016-17 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచి తక్కువ స్థాయిలో ఉంటూ వస్తోందని, ప్రభుత్వం, విధాన నిర్ణేతలు మేల్కోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని గ్రాంట్ థోర్న్‌టన్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ పేర్కొంది. ‘చమురు ధరలు పెరుగుతుండటం, ఫలితంగా పైకి ఎగబాకుతున్న ద్రవ్యోల్బణం, కీలక వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు వంటివి బాగా వినపడుతున్న భారత్‌లో పెట్టుబడులు తిరిగి పెరుగుతాయనే దానికి ముప్పుగా పరిణమించాయి’ అని గ్రాంట్ థోర్న్‌టన్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) విశేష్ సీ చందియోక్ పేర్కొన్నారు.