బిజినెస్

2018-19లో ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: భారత ఎగుమతుల్లో రానున్న నెలల్లో ఆరోగ్యకరమయిన వృద్ధి రేటు నమోదవుతుందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతులు 350 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయనే అంచనాతో ఉన్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం కీలక పాత్ర పోషిస్తోందని, 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం పరిమాణం మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఉత్పత్తి పెరుగుదలలో, పోటీతత్వం పెరుగుదలలో సేవల రంగం గణనీయమయిన పాత్ర పోషిస్తోందని మంత్రి సురేశ్ ప్రభును ఉటంకిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు సేవలను ఎగుమతి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ‘ప్రపంచంలో రక్షణాత్మక విధానం పెరుగుతున్నప్పటికీ భారత ఎగుమతులు ఆరోగ్యకరమయిన స్థాయిలో వృద్ధి రేటును కొనసాగిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 350 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి’ అని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు సుమారు పది శాతం వృద్ధి రేటుతో 303 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.