బిజినెస్

సెనె్సక్స్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 25: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా మూడో రోజు బుధవారం సరికొత్త గరిష్ఠ స్థాయి 36,858.23 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ, విదేశీ మదుపరులు నిరంతరాయంగా కొనుగోళ్లు జరపడంతో ఈ సూచీ 33.13 పాయింట్లు పుంజుకుంది. జూలై నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు గురువారంతో ముగియనుండటం వల్ల మదుపరులు షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడానికి దిగడం కూడా సెనె్సక్స్ పుంజుకోవడానికి దోహదపడిందని బ్రోకర్లు చెప్పారు. బుధవారం కొంతసేపు ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీల తరువాత లోహ, ఫైనాన్సియల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం వల్ల సెనె్సక్స్ ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి అయిన 36,947.18 పాయింట్లను తాకింది. మంగళవారం నాటి ఇంట్రా-డే హై 36,902.06 పాయింట్లను అధిగమించింది. అయితే తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల కొంత పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 33.13 పాయింట్ల (0.09 శాతం) ఎగువన 36,858.23 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం నాటి గరిష్ఠ స్థాయి ముగింపు రికార్డు 36,825.10 పాయింట్లను అధిగమించింది. ఈ సూచీ ఇప్పటి వరకు వరుసగా మూడు రోజులలో కలిసి 473.87 పాయింట్లు పుంజుకుంది. అయితే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ మాత్రం బుధవారం నామమాత్రంగా తగ్గి, మంగళవారం నాటి సరికొత్త గరిష్ఠ స్థాయి ముగింపు రికార్డు నుంచి కిందికి దిగజారింది. క్రితం ముగింపుతో పోలిస్తే 2.30 పాయింట్లు (0.02 శాతం) పడిపోయిన నిఫ్టీ 11,132.00 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఇంట్రా-డేలో ఈ సూచీ 11,157.15- 11,113.25 పాయింట్ల మధ్య కదలాడింది. మంగళవారం ఈ సూచీ సరికొత్త గరిష్ఠ స్థాయి 11,134.30 పాయింట్ల వద్ద ముగిసిన విషయం విదితమే.
ఇదిలా ఉండగా, మార్కెట్ ప్రస్తుత ర్యాలీకి మద్దతుగా నిలుస్తున్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మంగళవారం నికరంగా రూ. 104.34 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 513.78 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థలలో ఎస్‌బీఐ బుధవారం అత్యధికంగా 1.78 శాతం లాభపడింది. అదాని పోర్ట్స్ 1.53 శాతం లాభంతో రెండోస్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థలలో టాటా స్టీల్, వేదాంత లిమిటెడ్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, హీరో మోటోకార్ప్, రిల్, కోటక్ బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు ఎన్‌టీపీసీ 4.01 శాతం నష్టపోయింది. నష్టపోయిన ఇతర సంస్థలలో యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఆసియన్ పెయింట్స్, భారతి ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా ఉన్నాయి.