బిజినెస్

వాణిజ్యంపై చైనా దుర్మార్గపు వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: వాణిజ్య పోరులో యూరోపియన్ దేశాలతో చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో చైనా అనుసరిస్తున్న దుర్మార్గపు వ్యూహంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. చైనాలో వాణిజ్య అనుబంధ సమావేశం సందర్భంగా ట్రంప్ ఒక ట్వీట్ ద్వారా తమ దేశ రైతులను లక్ష్యంగా చేసుకుని చైనా సుంకాలను పెంచడాన్ని తప్పుబట్టారు. చైనా అనుసరిస్తున్న వైఖరితో తమ దేశంలోని రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో ట్రంప్ 12 బిలియన్ డాలర్లతో ఒక ప్యాకేజీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ వాణిజ్య బృందం కలుసుకుని చర్చలు జరిపింది. అల్యూమినియం, ఉక్కుపై సుంకాలను పెంచడాన్ని ట్రంప్ సమర్థించారు.
కార్లు, ట్రక్కులు, ఆటో విడి భాగాలపై సుంకాలను పెంచుతామని ఆయన హెచ్చరించారు. వీటి మార్కెట్ సామర్థ్యం 335 అమెరికా డాలర్లు ఉంది. వీటిపైన సుంకాలు పెంచితే తాము కూడా ప్రతీకార చర్యగా టారిఫ్‌లను పెంచాల్సి ఉంటుందని యూరోపియన్ వాణిజ్య బృందం స్పష్టం చేసింది. ఇదిలావుండగా, ట్రంప్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అమెరికా యూరోపియన్ యూనియన్లు రెండూ కలసి టారిఫ్‌లను, సబ్సిడీలను, అడ్డంకులను ఎత్తివేస్తామని సూచించారు. దీనివల్ల స్వేచ్ఛా విపణికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. కాగా, చైనా నిర్ణయాలకు ధీటుగా ఆ దేశానికి చెందిన వస్తువుల దిగుమతులపై ట్రంప్ ఇప్పటికే 34 బిలియన్ డాలర్ల సుంకాన్ని పెంచారు. దీనికి ధీటుగా చైనా కూడా సుంకాలను పెంచింది. దీంతో చైనా, అమెరికాలు పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ సుంకాలను పెంచుకుంటూ పోతుండడంతో మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. కాగా, ఇపుడు తాజాగా చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై మరో 500 డాలర్ల సుంకాలను పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. చైనా, అమెరికా తీసుకుంటున్న చర్యల వల్ల ఇటు ఎగుమతిదారులు, అటు మార్కెట్, పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.