బిజినెస్

కన్స్యూమర్ డ్యూరబుల్స్‌పై దిగుమతి సుంకం పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: దేశీయ పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించడానికి కన్స్యూమర్ డ్యూరేబుల్ సరుకుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలనే ప్రతిపాదనను కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) పరిశీలించనుంది. చౌక దిగుమతుల నుంచి తమను కాపాడటానికి కన్స్యూమర్ డ్యూరేబుల్ సరుకుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలని ఇండస్ట్రీ ఇదివరకే ప్రభుత్వాన్ని కోరింది. ‘దేశీయ పరిశ్రమ తనను కాపాడాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి చెప్పింది. ఈ విషయంలో మా వద్దకు వచ్చిన అన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం’ అని సీబీఐసీ చైర్మన్ ఎస్.రమేశ్ తెలిపారు. కన్స్యూమర్ డ్యూరేబుల్ సరుకుల దిగుమతులపై సుంకాలను పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా? అని ప్రశ్నించగా, ఆయన పైవిధంగా బదులిచ్చారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి గత వారం చిన్న తెర టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. తగ్గించిన పన్ను శుక్రవారం నుంచి అమలులోకి వస్తుంది. ఇదిలా ఉండగా, సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రమేశ్ మాట్లాడుతూ జీఎస్‌టీ మండలి గత వారం ప్రజలపై అదనపు భారాన్ని తగ్గించడానికి కొన్ని వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాలని నిర్ణయించిందని తెలిపారు.